-
-
దాలప్ప తీర్థం
Dalappa Teertham
Author: Dr. Chintakindi Srinivasa Rao
Publisher: Srinija Publications
Pages: 106Language: Telugu
కళిగాంధ్ర వారసుడు
రెండు జీవిత దృశ్యాల మధ్య పోలిక చూడడం కవిత్వమైతే, వైరుధ్యాన్ని చూడడం కథగా రూపొందుతుంది. కొన్ని సార్లు దుఃఖమయంగానూ, కొన్ని సార్లు హాస్యాస్పదంగానూ ఉండే ఈ వైరుధ్యాల్ని చూసి మౌనంగా ఉండడం కష్టం. అనాది కాలం నుంచి కథనకుతూహలానికి ప్రేరణ మొదలయ్యేదిక్కణ్ణుంచే..
ఒక చాసో, ఒక రావిశాస్త్రి, ఒక పతంజలి కళిగాంధ్రలో మాత్రమే పుడతారు. ఇదిగో, ఇప్పుడీ కథలది కూడా అదే దారి. చింతకింది శ్రీనివాసరావు చెబుతున్న ఈ కథలు చోడవరానికి, నెల్లిమర్లకీ మధ్యలో కళిగాంధ్ర నడిబొడ్డులో జనం చెప్పుకుంటూ వస్తున్న కథలు. ఈ కథలకి కులం, మతం, వర్గం లేవు. ఇందులో వాస్తు సిద్ధాంతి పిడపర్తి విశ్వేశ్వర సోమయాజులు మొదలుకొని పాయఖానాలు శుభ్రం చేసే పెంటపాలెం దాలప్ప దాకా అందరూ ఉన్నారు. ఈ కథల్లో కనిపించే జీవితం ఎవరో ఒక సోషియాలజిస్టు ప్రతిపాదించే జీవిత సూత్రాల ప్రకారం నడిచేది కాదు. నిజానికి, ఈ జీవితాన్ని నడిపించే సూత్రాలేమిటో తెలుసుకోవాలన్న జిజ్ఞాస కొత్త సోషియాలజీకి తలుపులు తెరుస్తుంది.
జీవిత వైరుధ్యాలని పట్టుకోవడం తోటే ఒక మనిషి కథకుడిగా మారినా, అతడి ప్రయాణం అక్కడితో ఆగిపోదు. వైరుధ్యాల్ని దాటిన ఒక సుందరదృశ్యాన్ని మనతో పంచుకోవాలన్న కవి కూడా ప్రతి కథకుడిలోనూ దాగిఉంటాడు.
చింతకింది శ్రీనివాసరావు కథల్లో కూడా ఆ అమాయకమైన కవితాస్వప్నం కనిపిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది.
- వాడ్రేవు చినవీరభద్రుడు
- ₹118.8
- ₹118.8
- ₹172.8
- ₹129.6
- ₹135
- ₹135
- ₹118.8
- ₹118.8
- ₹172.8
- ₹129.6
- ₹162
- ₹129.6
ఈ పుస్తకం కొని చదివాను, చాలా చాలా బాగుంది. దీనిపై నా యూట్యుబ్ చానెల్ లో ఒక పరిచయ వీడీయో చేశాను. చూడండి.
https://www.youtube.com/watch?v=p1IrusqRwJo
రావిశాస్త్రి, చాసో, పతంజలి కధల్లో ఉన్న మానవీయ స్పర్శ, ఈ కధల్లో ఉంది అనటంలో సందేహం లేదు . కానీ.. ఒక జర్నలిస్ట్ గా శ్రీనివాస రావు గారికి…మనుషులు, సమూహాలు తమ సామాజిక, సాంస్కృతిక లేమికి, ప్రస్తుతంలో కనుక్కొంటున్న పరిష్కారాలు కూడా పరిచయం ఉండే ఉంటాయి . అవికూడా ఇంకా ఎక్కువ రాయటం , కొత్త సోషియాలజీ కే కాదు .. కొత్త కధల కీ, మరిన్ని జీవితాల మార్పులకీ కూడా దోహదం అవుతుంది.
- Sai padma