• Dwadasa Vyasa Tarangini
 • Ebook Hide Help
  ₹ 30 for 30 days
  ₹ 108
  120
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • ద్వాదశ వ్యాస తరంగిణి

  Dwadasa Vyasa Tarangini

  Pages: 134
  Language: Telugu
  Rating
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 votes.
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

“… ఈ వ్యాసాలన్నింటా ఉన్నది లోతైన పరిశోధన, గాఢమైన జిజ్ఞాస... లోకాన్ని జ్ఞాన సంపన్నం చేయాలనే ఆరాటం...”

- ఆచార్య బేతవోలు రామబ్రహ్మం

* * *

“జిజ్ఞాస+పరిశీలన+విశ్లేషణ=కొత్త కోణాల ఆవిష్కరణ ఈ ‘ద్వాదశ వ్యాస తరంగిణి’... ఈ వ్యాసాలలోని విషయం కూడా ఎంతో వైవిధ్యంతో కూడుకొని ఉంది... ఒక పౌరాణిక ఇతివృత్తాన్ని నవలగా రూపొందించే రచయితకు అనువుగా తోడ్పడే ‘ఆక్సమ్స్ రేజర్’ అనే పరికరాన్ని పరిచయం చెయ్యటం ఒక కొత్త అంశం... భారతంలోని పాత్రలను నేపధ్యంగా తీసుకొని రాసిన ‘నస్త్రీ స్వాతంత్ర్య మర్హతి’ అనే వ్యాసం చాలా ఆసక్తికరమైన అంశాలను ముందుకు తెస్తుంది. ఇది ఒక తాజా అంశం. చర్చలోనూ తాజాదనం నిండి ఉన్న వ్యాసం ఇది. శీర్షిక కూడా తాజాదనాన్ని నింపుకొని తాజా విశ్లేషణ పద్ధతులతో నడిచే వ్యాసం ’అర్థం+కామం xధర్మం=?పయనం’ అనేది... అనువాద సిద్దాంతాలకు రాజశేఖరుడి హరణ పద్ధతులు అన్వయింపజేయటం ఆలోచించదగిన ఒక కొత్తకోణం . కార్టూన్లమీద, బొమ్మాట (యానిమేషన్) మీద రాసిన వ్యాసాలు తెలుగు పరిశోధనకే తాజాదనాన్ని సమకూరుస్తున్నై... చెప్పదలచుకున్న దాన్ని సమగ్రంగాను, శాస్త్రీయంగాను చెప్పాలనే తపనతో ఉన్నవాడు డా. సీతాపతి.”

- ఆచార్య పరిమి రామ నరసింహం

* * *

“మహాభారతం ఒక విజ్ఞానసాగరం చిలికినకొద్దీ మానవ జీవితతత్త్వాలను శోధించవచ్చు... సాంకేతికత మానవజీవిత అవసరంగా మారుతున్నది... కవిత్వాన్ని అర్థంచేసుకుని మంచిని జీవితంలోకి అన్వయం చేసుకోవాలి. తద్వారా మానవులు అన్నిరకాలుగా అభివృద్ధిపథంలో పయనించాలి... తమ భాషలోనికి చాలా భాషలలో ఉన్న ప్రసిద్ధ అంశాలన్నీ అనువాదం ద్వారా తెచ్చుకోవాలి. తమ మాతృభాషలోని గొప్పదనాన్ని వేరే భాషకు అనువాదంద్వారా అందించాలి. తద్వారా విశ్వమానవ శ్రేయస్సు కలిగేలా చేయాలి... రక్షణ , స్వేచ్ఛ, బాధ్యతలను అందరూ సక్రమంగా నిర్వహించాలి... ఈ నేపథ్యాలలో వచ్చిన వ్యాసహృదయంతో కూడిన పరిశోధన వ్యాసాలే ద్వాదశ వ్యాస తరంగిణి”

- రచయిత

Preview download free pdf of this Telugu book is available at Dwadasa Vyasa Tarangini
Comment(s) ...

మిత్రులు సీతాపతి రావు చక్కని వ్యాసాలు రాశారు. ప్రతీ వ్యాసం ఆణిముత్యం అనడంలో సందేహం లేదు. 12 వ్యాసాలు ఆదిత్యునిలా ప్రకాశిస్తున్నాయి.
-డా. బడ్డిపూడి జయరావు

This is a truly good for a researcher point of view. Good wishes to Dr. J. Seethapathi rao

పరిశోధనకు ఈ పుస్తకం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. వైవిధ్యమైన విషయాలతో వ్యాసాలు రాయడం డా.జె. సీతాపతిరావు జిజ్ఞాసకు ప్రతీకగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని ఆచార్య పరిమి రామనరసింహం గారు చక్కగా సమీక్షించారు. న స్త్రీ స్వాతంత్ర మర్హతి ఒక ఆణిముత్యం. ద్రౌపదిని చక్కని శోధనతో విశ్లేషణ చేశారు. శేషేంద్ర వైచిత్రి మరో అంశం. ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో విషయాలను ఆలోచింపజేస్తూ పాఠకుడికి కిట్టుబాటు అవుతుంది అనడంలో సందేహం అవసరం లేదు. పుస్తక పాఠకులకు పరిశోధన స్థితిని చూపించడానికి ఈ పుస్తకం సహకరిస్తుంది అనడం అతిశయోక్తి కాదు. తొలి ప్రయత్నంలో మంచి పుస్తకాన్ని అందించిన సీతాపతిగారు ప్రశంసనీయులు. మరిన్ని పరిశోధన వ్యాసాలు, సృజనాత్మక పుస్తకాలు రావాలని ఆకాంక్ష.
-కొత్తపల్లి రాములు యం.ఏ., (పిహెచ్.డి)