-
-
రుజువులు లేని ఉద్యమం
Rujuvulu Leni Udyamam
Author: Visalandhra Mahasabha
Publisher: Visalandhra Mahasabha
Pages: 128Language: Telugu
రుజువులు లేని ఉద్యమం
ఢిల్లీలో పుస్తక ఆవిష్కరణ సభలో ప్రముఖుల ప్రసంగాలలోని మాటలు
"చాలామంది నన్ను ఈ పుస్తక ఆవిష్కరణకు వెళ్ళవద్దని ఫోను చేసారు. ఈమెయిల్స్ ఇచ్చారు. అలాంటివారు ఈ పుస్తకం చదవాలని నేను అంటున్నాను. వారు చెప్తున్నవి చాలా వరకు ఈ పుస్తకం చర్చించింది..... తెలంగాణా ప్రజల వ్యధను నేను పూర్తిగా అర్థం చేసుకోగలను... కానీ దాని పరిష్కారం ప్రత్యేక రాష్ట్రం కాదు. పరిష్కారం ప్రాంత అభివృద్ధి."
- శ్రీ సంజయ్ బారు
ప్రధాని మాజీ మీడియా సలహాదారు
"మనం చూస్తున్న ఈ భావోద్వేగం చాలా వరకు పనిగట్టుకుని రెచ్చగొట్టబడ్డది. కావాలని ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమైన కీలకమైన తరుణాలలో దీనిని ప్రేరేపిస్తున్నారు తప్ప, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితికి ఏ మాత్రం కూడా ఇది సంబంధం ఉన్నది కాదు. నా ఉద్దేశంలో ప్రస్తుతం తెలంగాణ ఆందోళన మొత్తం మీద ఇలా రెచ్చగొట్టబడ్డ భావావేశం మాత్రమే"
- శ్రీ అజయ్ సాహ్ని
దేశభద్రతా వ్యవహారాల నిపుణులు
"కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు నిర్ణయించే ముందు అవి ఏ ప్రాతిపదికన ఏర్పడాలి అనే దానిమీద అంగీకారం రావాలి. ప్రాతిపదిక భాష కావచ్చు, వెనుకబాటుతనం కావచ్చు. జాతి పరమైన ప్రత్యేకతలు కావచ్చు. కానీ వీటితో పాటు అవి ఆర్ధికంగా నిలదొక్కుకోగలవా లేదా అని కూడా పరిశీలించాలి. అందుకే, ఇక్కడొక రాష్ట్రం, అక్కడొక రాష్ట్రం హడావుడిగా ఏర్పాటు చేయడం కంటే, నా ఉద్దేశ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీలాంటిది ఏర్పాటు చేసిన్ మొదట రాష్ట్రాల ఏర్పాటు ఏ ప్రాతికపదిక మీద జరగాలి అనే దానిని పరిశీలించాలి."
- శ్రీ అశోక్ మాలిక్
ప్రముఖ పాత్రికేయులు
A must read book by every Telugu peron all over the world to know the bitter truths. I really wish that the TELUGU LAND maintains its unity