• Ram at Shruthi Dot com
 • Ebook Hide Help
  ₹ 30 for 30 days
  ₹ 86.4
  96
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • రామ్@శృతి.కామ్

  Ram at Shruthi Dot com

  Pages: 147
  Language: Telugu
  Rating
  4.25 Star Rating: Recommended
  4.25 Star Rating: Recommended
  4.25 Star Rating: Recommended
  4.25 Star Rating: Recommended
  4.25 Star Rating: Recommended
  '4.25/5' From 32 votes.
  3.95 Star Rating: Recommended
  3.95 Star Rating: Recommended
  3.95 Star Rating: Recommended
  3.95 Star Rating: Recommended
  3.95 Star Rating: Recommended
  '3.95/5' From 20 premium votes.
Description

ఇంచుమించు మయసభలో దుర్యోధునుడికి జరిగిన పరాభవమే నాకు కూడా జరిగింది (ద్రౌపదులు లేకపోవటం అదృష్టం). ఆ భవంతిలో ఒక అద్దాల ద్వారం ఉంది. దానిని ఎలా తీయాలో అర్ధం కాక దాని ముందుకు భయం భయంగా వెళ్ళగా, అది తమాషాగా దానంతట అదే తెరుచుకుంది. కాకపోతే ఎవ్వరూ గమనించక పోవటంతో ఊపిరి పీల్చుకున్నాను. ఇలాంటివి ఎన్నో జరిగాయి. అన్నీ చెప్పుకోలేము కదా ! సరిగ్గా బల్లలు కూడా లేని కాలేజీల్లో చదివిన వాళ్ళకి ఇవన్నీ కొత్తే మరి !

‘జావా’ అనే మాట వినేసరికి నా గుండె గొంతులోకి వచ్చేసింది. ఇది వరకే మూడు సార్లు జావా నేర్చుకోవటం మొదలుపెట్టి, అర్ధం కాక, అరగక మానేశాను. ఇక జీవితంలో జావా చదవటం కాదు కదా, కనీసం త్రాగ కూడదు అని గట్టిగా ఏ ముహుర్తాన అనుకున్నానో, అదే జావాని ఇప్పుడు అంతకంటే గట్టిగా నేర్చుకోవాల్సిన పరిస్ధితి.

‘‘నాపేరు శృతి, నేను హైదరాబాదులోనే పుట్టి పెరిగాను’’. అని చక్కని శృతిలో చెప్పింది. ఆ మాటలకు ఉలిక్కి పడి లేచాను, ఎవరా శృతిగల హైదరాబాదు అని. ఆకు పచ్చని చుడీధార్‌లో ముక్కుపచ్చలారని మచ్చలేని ముఖం.

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ చిత్రంలో శ్రీదేవి మాదిరి చాలా అందంగా, ముద్దుగా, కొంచెం అమాయకంగా ఉంది. సుమారు ఐదు అడుగుల ఐదు అంగుళాల ఎత్తు ఉంటుంది. ఒక్క మాటలో కాదు కాదు ఒక్క వాక్యంలో చెప్పాలంటే పాలలో ముంచి తీసిన హంపీ శిల్పంలా ఉంది. ఇలా ఇదివరకు ఎంతోమంది చెప్పారనుకుంటే, ఇప్పుడే కొన్న కొత్త ఐఫోను లాగా ఉంది.

ఒక్కసారిగా చల్లని గాలి తాకింది. చిన్నగా వర్షపుజల్లు మొదలైంది. చక్కగా విరిసిన పూలు గాలికి మెల్లగా ఊగుతూ ఆ జల్లుల్లో తడుస్తున్నాయి. మామాలుగా అయితే ఇలానే జరగాలి, కానీ మేము అద్దాలచే బిగించిన ఏ.సి గదుల్లో ఉండటం చేత నేను ఆ దృశ్యాలని కోల్పోయాను.

Preview download free pdf of this Telugu book is available at Ram at Shruthi Dot com
Comment(s) ...

The first telugu ebook in my life :D , Maybe my 3rd telugu novel. Its written in very simple language and has the style of page turner books can equate it to sidney sheldons or chetan bhagat types where as you keep reading you will not stop until you finally finish it and then come out :)

The story was very well written but the ending was too unnatural and it felt like the author was stuck at the end and had to somehow write a nice conclusion. Anyways it was like watching shekar kammula movie lot of feel goodness ! Keep writing more so that first timers can read more telugu :)

bagundi...nijamgaa chala lively ga simple ga undi...

చాలా రోజుల తరువాత ఒక పుస్తకాన్ని పూర్తిగా,ఆపకుండా చదివాను.రచయిత ఎవరో గానీ,నా హార్ట్ ని టచ్ చేసారు.ఆద్బుతమైన కధ,కధనం.ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదవవలసిన పుస్తకం.

Wonderful book and written romantically. Egos between couple are explained fantastically. Everyone should read it once.

This book was awesome..especialy,narration was great..A good read for all the young IT professionals..

Ram@shruthi.com Peru lone kottadanam undi.. Ika navala gurinchi chepali ante hasyam, lasyam, kavyam, navyamu anni kalagalipina oka adbuthamaina rachana :-P
It was jus captivating and fantabulous we look forward for your other novels good luck anantharam. Great job :)

Lovely book.I liked your style of writing. will wait for more books from you.
Thank you.

good book .. the situations are more close to the real time scenarios in IT industry

Book is awesome.... thanks to ananth ram for giving humorous book... we are expecting lot of such books from you.....

Great narration skill. Keep going. All The Best. i completed this book at a stretch.

నేను ఈ పుస్తకం చదివాను.....నాకు బాగా నచ్చింది......

"కొవ్వొత్తి కాంతి భోజనం", "జ్ఞాన బదిలీ". hayiga chadivinchindi. software anagane aakashamlo telakunda, nela meeda nadiche abbayini choopinchadam chala bavundi. veelainanthaga chakkani telugulo raasthoo, krutakamga kanipinchakunda unna andamaina rachana. ee madhya konni telugu kathalu leka pustakalu chadivithe teluga, englisha chadivedi artham kavatam kashtamga undi, kanee Ram @ shrthi.com nijamga vibhinnamga unna andaaina rachana. rachayithaku abhinandanalu.

Felt good after reading the book. Superb narration, liked the characterization of main leads and chitalati kalyana Srinivasa raju is wonderful. Cinema ga tisthe ee character Prakash raj de

అద్భుత:.
రామ్@శృతి.కామ్ - ఒక యాదృచ్ఛిక సమీక్ష
http://anaganagaokurradu.blogspot.co.uk/2013/05/blog-post.html

wonderful book,nice narration... completed the book in 2 days.. i just wanted to know the end.. full of excitement.. love the book

రామ్@శృతి.com

'జన్మ ధన్యం అయ్యింది' అంటారు కదా అలా ఉంది ఈ పుస్తకం చదువుతూంటే...

ప్రతి పేజి తిప్పగానే హఠాత్తుగా చక్కిలిగింతలు పెట్టినట్లు హాయిగా నవ్వడమే...

త్రివిక్రమ్ కి ఏమాత్రం తగ్గని చమత్కారాలు

ఈ సాఫ్టువేరు ప్రణయగాధ అలా అలా తెలియకుండా చదివించేస్తుంది.

రచయిత స్వంత బ్లాగులో కూడా చదువ చక్కని చమత్కారాలు చాలా ఉన్నాయి.
http://ramaddanki.blogspot.sg

అయ్యా అద్దంకి అనంతరామయ్యా ఇంత చక్కని ప్రణయగాధని చక్కిలిగింతలతో నింపిన మీ చమత్కారాలకు ఫిదా అయ్యాము. 'శ్రీ శ్రీ' తరహాలో 'అ అ' కలం పేరుతో మీరు వర్థిల్లాలని తెలుగు తల్లి సేవలో తరించాలని కోరుకుంటున్నాను. మీకు మా హృదయపూర్వక అభినందనలు.

ఈ పుస్తకం మన 'కినిగే' లో కొని చదివేయండి. ఆలస్యం అమృతం కోకాకోలా

Very nice book which touches heart. This book has Comedy, Sentiment and convincing climax. I felt like I was watching a good movie without songs. :)

Nice work..short and crisp.Completed the whole book at a stretch. The narration is very lively and written in a very fluent and enjoyable Telugu. Thoroughly enjoyed the onliners and sayings and appreciate the author for the effective use of the same.
Wish him even more success in his future projects.

Manasu ki aahladakaram gaa.....chaala baagundi :)

book chaduvutunnanta sepu chala enjoy chesanu... kanii... chala mandi premukula vishayam lo ee pelli chupula ghattam undadu(almost 99%)...mari vallela kalusukuntaru anna doubt ochindi.. climax koncham realistic ga unte bagundu anipinchindi...

I just studied ur book..thats a brilliant work..and..u just proved me, telugu writers got the content..no romance, simple love story which carried away..somethng like that till the end..iam waiting for ur next book..all the best.

Good Love Story and Happy ending...thanks to AA

Really a good novel with good humour and great story line. we expect many novel from you in near future.All the best...

bro mee book mottham chadivanu...ledhu chadivinchindhi aa pusthakam..konni pusthakalani chadavalsi untundi , konni pusthakalu manalni chadivisthayi antaru ga rendo kovaloki vasthundi meru raasina book...awesome, chaala bagundhi..continue ga chadivinchindhi...edi kalpano nijamo thelidhu kaani ee pusthakamlo rasindantha mee jeevithamlo nijamga jarigindhemo annantha brama kaliginchindhi...
aithe mana telugu cinemallo laa last ki happy ending icharu kada adhi koncham artificial ga undi...twist poindi akkada....migathadantha chala naturalga gripping ga raasaru....mee snehithudu chanipoyina sangatana cheppi kadilinchaaru...
mottham meedha naakaithe chaala anubuthulu kaligayi ram@shruthi.com chadivaka....santhosham, baadha, gatham, paatha gnaapakalu gurthuku ravadam....konni kottha alochanalu reketthinchindhi...annitiki minchi telugu baasha paina meekunna pattu vismayam kaliginchindhi....english(aanglamuni) padhaalanu telugu lo telugu padhaalanu english lo chamathkaaranga tharjuma chesaru brother....mee nunchi inka pusthakalu raavalani ashisthunnanu....thx....keep smiling....stubborn kiran :-)

రామ్@శృతి.com నేను చదివిన మొదటి ప్రేమ కధ..రచయిత ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దిన విధానం నాకు చాల నచ్చింది..ఈ పుస్తకం చదువుతున్నంత సేపు ఒక చలన చిత్రం చుసిన అనుభూతి కలిగింది…..ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని సాఫ్ట్ వేర్ సంస్థల్లో ఉద్యోగం చెయ్యాలనుకొనే యువతకి అక్కడ ఎదురయ్యే పరిస్తితులు, ప్రేమలో ఉన్న యువతకి, లక్ష్యాన్ని సాధించాలనుకొనే వాళ్ళకి ఈ పుస్తకమొక మార్గదర్శి

superb narration especially emotional feelings are heart touching..i feel like an movie...thanku bro

I do not know if it its authors debut work, but the work is simple and heart touching..The main asset of this book is its underlying comedy..in the first time reading I laughed like anything

నాకు పుస్తకాలు చదివే అలవాటు అస్సలు లేదు. ఎక్కడో నెట్ లో ఒక చోట రామ్ అనే అతను బుక్ చాలా బాగా రాశాడు అని చదివాను. ఏదో తెలియని ఆసక్తి ఆ పుస్తకాని చదవాలి అనిపించిపించి, ఆ పుస్తకాని డౌన్లోడ్ చేసుకొని చదివాను. బాగుంది అనడం కంటే మనసుకు హతుకుంది. ఇది బహుశా రామ్ గారి ఊహ అయివుండవచ్చు, ఈ పుస్తకం లోని పాత్రలు మన చుట్టు వుండే(ముఖ్యంగా ఇంజనీరింగ్ మరియు ఐటీ ఉద్యోగులలు) చాలా దగ్గరగా వున్నాయి. అతను సనివేశాన్ని మలిచిన తీరు చాలా బాగా ఆకట్టుకుంది. చివరగా విడిపోవాలనుకునే ప్రేమ జంటలలు కానీ ఈ బుక్ ను చదివితే కచ్చితంగా వాళ్ళు మల్లీ ఒకటయి తీరుతారు. ఒక్క మంచి ప్రేమ కథ రామ్@శృతి .కామ్. మరిన్ని నవలలు ఆశిస్తున్నాను

Hi AA,

I felt this was real story, such a nice book. You have a great narration skills with humour, romance, sentiment....
Duologues with timing is like 'maro trivikram'. Story is clear, straight without nonsense.Really felt like watching movie.

We are expecting more from you.
Hope you will succeed in delivering these.

Wish you all the best!!!!

Such a wonderful book and a great page turner.

Very Good Book.I am unable to stop reading this book till end.Red the book at a time.

Ram ,Your Andhra Chetan Bhagat.
Sorry ... Chetan Bhagat wrote his books like you :)

Keep Rocking Chap :)
Waiting for next book.... :)

Your narration on Love,romance,emotions,egos mixed with Humor is really awesome.Your narration about parents is the best amongst everything. I could not stop reading until it is fully completed. Applauds to your thorough work in reciting this beautifully...All The Best

ee book chala chala baga rasaru ,ego's valla manam em kolpotunamo kuda chala baga rasaru.....manchi book....

Excellent narration....don't miss.

hieee Mr.Ananthram...excellent narration with superb feel...book was just awesome...

Started reading the book casually. Once completed first 10-15 pages, could not stop reading the book till I complete it at a stretch.
Written wonderfully by Ram.. Beautifully described the feelings and the egos of two persons and how they resolved their issues to be together.
The lines in the book reminded me of my early days in the software industry and few of them are close to my heart.
Excellent effort by you Ram.. All the best and wish you a wonderful future ahead..

చేతన్ భగత్ పుస్తకాలు చదివినప్డు ఇలాంటివి తెలుగులో రాయరు ఎందుకు అని చిన్న అసంతృప్తి అనిపించేది. అది తీరిపాయింది ఇది చదువుతుండగా... ఇంకా పూర్తి గా చదవలేదు .. 112వ పేజి దగ్గర ఆగాను... ఇప్పటి వరకు చాల బాగుంది. చాలా చోట్ల చదువుతూ చదువుతూ ఉన్నపళంగా గట్టిగ నవ్వుకున్నా... ఆ తర్వాత పేజిలు కూడా అంతే నవ్విస్తాయి అని ఆశిస్తున్నాను....

Am not able to get pdf format..only ACSM file getting downloaded after i paid money.Could you please let me know any one how to download full book

Amateur attempt. Bad prose. Horrible flow. A 'love' story which hardly has love between leads.

First attempt లోనే అదరకొట్టారు.

కథ చాలా simple గా ఉన్నా, వ్రాసిన విధానం, భాష బాగుంది.

కానీ climax మాత్రం sudden గా ముగించెసినట్టు వుంది. Next పేఙీ ఎమైనా miss అయ్యానా/ ప్రింటవ్వలేదా అన్నట్టు ఠకమని ఆపేసినట్టు అనిపించింది.
రచయిత ఒక ముందు మాట ఈ కథ కి స్ఫూర్తి ఎక్కడ నించి వచ్చింది లాంటివి రాస్తే బాగుండేది.

I liked it,but based on reviews i expected alot..but worth to read it once..

Hai Readers I want Hard Copy of
Ram@Shruthi.com book.
so Plz tell me any Bookstall in Hyd.

[Kinige Admin] Please note that this book is available only as eBook. When the book is made as print book in future, the print book will also be available for sale from this page itself![/KinigeAdmin]