-
-
షడ్రుచులు సిరీస్ 1 – స్నాక్స్
Shadruchulu Series 1 Snacks
Author: Jyothi Valaboju
Pages: 55Language: Telugu
షడ్రుచులు సిరీస్ 1 – స్నాక్స్
అన్నదాతా సుఖీభవః
కడుపునిండా రుచికరమైన భోజనం తినగానే వచ్చే మాట ఇది. ఆకలి ఎరిగి అన్నం పెట్టినవారిని సాక్షాత్తు అన్నపూర్ణగా భావించే పవిత్ర సంప్రదాయం మనది. తనవారికోసం రకరకాల వంటకాలు నేర్చుకుని వండి పెట్టడం దాదాపు ప్రతీ వారికీ ఇష్టమైన, సంతోషాన్నిచ్చే కార్యక్రమం. నాకు కూడా చిన్నప్పటినుండి అమ్మ చేసిన వంటలు తినడం తప్ప వండడం రాకున్నా పెళ్లయ్యాక తప్పదు కదా. అప్పుడు నేర్చుకోవడం మొదలెడితే ఇంకా అయిపోవడంలేదు. సరదాగా మొదలెట్టిన బ్లాగు ప్రయాణంలో నాకు నచ్చిన, వచ్చిన వంటలను షడ్రుచులు అనే బ్లాగులో పెట్టసాగాను. తర్వాత్తర్వాత బ్లాగు విశిష్ట గుర్తింపు పొందింది.
మూడేళ్ల క్రింద నా వంటల ప్రయాణం షడ్రుచులు వెబ్ సైట్ రూపంలో కొత్త దారిలో పయనించడం మొదలుపెట్టింది. తర్వాత ఆంధ్రభూమి దినపత్రికలో రుచి పేరుతో రెండేళ్లుగా వ్రాస్తున్న నా వంటల కాలమ్ నేను వంటలు చేయడం నుంచి వంటలు వ్రాయడం దిశగా సాగిన మరో ముందడుగు. ఈ కాలమ్ మూలంగా కొత్త కొత్తవంటల గురించి తెలుసుకోవడం, ప్రయోగాలు చేయడం ఉత్సాహాన్నిచ్చే వ్యసనంగా మారింది.. ఈ క్రమంలో నేను స్వయంగా చేసిన వంటలు ఇలా ఈబుక్ లా మీ ముందుకు తీసుకొస్తున్నాను.. మీ సలహాలు, సూచనలు తెలుపగలరు. దీనివలన నన్ను నేను ఇంకా మెరుగుపరుచుకోగలను. ముందు ముందు మరిన్ని పుస్తకాలు తయారు చేయగలను.
- జ్యోతి వలబోజు
