-
-
మొరసునాడు కతలు
Morasunadu Katalu
Author: Multiple Authors
Publisher: Krishnagiri Zilla Rachayitala Sangham
Pages: 328Language: Telugu
స.వెం. రమేశ్, స. రఘునాథ సంపాదకత్వంలో వెలువడిన కథల సంకలనం "మొరసునాడు కతలు".
* * *
ఇప్పటి ఆంద్ర, కన్నడ, తమిళనాడులలో మూడు ముక్కలయి నిలిచి ఉంది మొరసునాడు.
కర్నాటకలోని కోలారు, చిన్నబళ్లాపురం, బెంగుళూరునగర పెవ్వంటెము (జిల్లా)లు అంతా, బెంగుళూరుగ్రామ పెవ్వంటేములోని పెద్దబళ్లాపురం, దేవునిపల్లి, కొత్తకోట (దొడ్డబళ్ళాపుర, దేవనళ్లి, హోసకోట) వంటెములు (తాలూకాలు), ఆంద్రనాడులోని పాత కుప్పం, పలమనేరు, పుంగనూరు, హిందూపురం వంటెములూ, మదనపల్లి వంటెములో ఎక్కువపాళ్లూ, తమిళనాడులోని హోసూరు, డెంకణికోట వంటెములూ, వేమనపల్లి పిర్కా కలిస్తే అప్పటి మొరసనాడు అవుతుంది.
ఈ పొత్తంలో మొత్తం ముప్పయి కతలున్నాయి. మొదటి పదికతలు ఆంద్రతావు మొరసునాడు వాళ్లు రాసినవి. రెండవ పదీ కర్నాటకతావు మొరసునాడువాళ్ళు కన్నడంలో రాసినవి. వాటిని తెలుగులోకి మార్చి మీ ముందు ఉంచినాము. మూడవ పదీ తమిళనాడులో చేరిపోయిన మొరసునాటి కతలు. ఈ తావున ఇప్పటికీ తెలుగుబడులే ఎక్కువగా ఉన్నందున వీళ్లు తెలుగులోనే రాయగలిగినారు. హోసూరు తావునుంచి వచ్చిన కతలన్నింటిలోనూ మొరసునాటి తావి ఉంటుంది. కోలారు తావు కతలలో కూడా చాలా వాటిలో ఈ మున్నుగుమ్ములు గుమగుమలాడుతాయి. ఎటొచ్చీ ఆంద్రతావు నుంచి వచ్చిన కతలలో రెండుమూడు తప్ప మిగిలినివేవీ మొరసునాటి బతుకును ఎత్తి చూపించలేకపోయినాయి. ఈ చిన్నలోటే తప్ప అవి చాలాచాల గొప్ప కతలు.

- FREE
- FREE
- ₹180
- FREE
- ₹270
- FREE