-
-
ఆచార్య ఆత్రేయ మధుర గీతాలు
Acharya Aatreya Madhura Geetaalu
Author: Dr. Jayanti Chakravarthi
Pages: 514Language: Telugu
తెలుగు సినీగేయ రచయితలలో మనసు గీతాల మధురకవి ఆచార్య ఆత్రేయది ఒక అంతులేని కథ. అలతి పదాలతో అనంతార్థాన్ని అందించే ఆత్రేయ పాటలు రసజ్ఞులకు మధురమైన వ్యధ. 1951లో దీక్ష చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన 1990లో విడుదలైన ప్రేమయుద్ధం చిత్రందాకా 4 దశాబ్దాలపాటు మనసు పట్టే - మనసు పెట్టే - మనసు తట్టే - మనసు తిట్టే మనసైన సొగసైన గీతాలను రాసిన మన(సు) కవిగా, మహాకవిగా తెలుగువారి హృదయాలలో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించికున్నారు ఆచార్య ఆత్రేయ.
తెలుగు సినిమాలలో సుమారు 1300 పైచిలుకు రాసిన ఆయన పాటలు రాసిలో వాసిలో ఎంతో ప్రసిద్ధి పొందాయి. సినీపరిశ్రమలో సుప్రసిద్ధ సంగీత దర్శకులైన స్వరబ్రహ్మ కె.వి.మహదేవన్, శ్రీ పెండ్యాల, శ్రీ ఎమ్.ఎస్. విశ్వనాథన్, శ్రీ ఇళయరాజా, శ్రీ సత్యం, శ్రీ చక్రవర్తిల స్వరకల్పనలో వచ్చిన ఆత్రేయ గీతాలు నాటికీ, నేటికీ ఏ నాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. నిలిచిపోతాయి.
మనసుకవి ఆచార్య ఆత్రేయ మధురగీతాలు అనే ఈ గ్రంథంలో వివిధ సంగీత దర్శకులు స్వరపరిచిన 500 ఆత్రేయ పాటలను సంకలనం చేసి మీకందిస్తున్నాం. ఇందులో సుప్రసిద్ధ గీతాలతో పాటు భావగాంభీర్యం సౌందర్యం ఉన్న పాటల్ని కూడా పొందుపరిచాం. ఆత్రేయ అభిమానులందరినీ ఈ పాటలు అలరిస్తాయనే విశ్వాసం. ఈ సంకలనానికి అవకాశం కల్పించి, ఈ గ్రంథాన్ని తెలుగు ప్రజలకు అందిస్తున్న జె.పి.పబ్లికేషన్స్ అధినేత శ్రీయుత జక్కంపూడి ప్రసాద్ గారికి హృదయపూర్వక అభివందనాలు సమర్పిస్తూ......
నమస్కారాలతో....
- డా. జయంతి చక్రవర్తి
- ₹64.8
- ₹72
- ₹72
- ₹540
- ₹64.8
- ₹72
దయచేసి శ్రీ శ్రీ గారి పాటల పుస్తకాన్ని కూడా అందించండి