-
-
ఆత్మాగమనం
Aatmagamanam
Author: Suryadevara Rammohana Rao
Publisher: Madhu Priya Publications
Pages: 302Language: Telugu
తార్నాకలో ఆ రోడ్డు ఎల్లప్పుడూ జన సమ్మర్ధంతో నిండి వుంటుంది. అటూ ఇటూ హడవిడిగా పరుగెడుతున్న బస్సులు, జనం ఉరుకులు పరుగులతో వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరి ముఖంలో ఏదో హడవుడి... తొందర... మనిషి జీవితం చాలా వేగవంతమైపోయింది' మనసులోనే అనుకున్నాడు ప్రసన్నహనుమ.
కొంచెం దూరంలో రోడ్డు దాటడనికి అవస్థ పడుతున్న ముసలి దంపతులమీద నిలిచింది అతని దృష్టి, అతని మనస్సు ద్రవించింది. వయస్సులో పెద్దవాళ్ళన్నా, చిన్నపిల్లలన్నా అతనికి అమితమైన ఇష్టం. కల్మషం ఎరుగని వారి బోసి నవ్వులు అతని హృదయంలో పూలు పూయిస్తాయి.
అతను ఆదుర్దాగా వారివంకే చూస్తున్నాడు. ఇంతలో ఎక్కడ్నుంచో హడవుడిగా వచ్చింది ఓ పదేళ్ళపాప. తెల్లటి యూనిఫాంతో విశాలమైన అడవిలో చెంగు చెంగున గెంతే కుందేలుపిల్లలా అక్కడికివచ్చి రోడ్డు దాటబోతూ అప్రయత్నంగా తలతిప్పి ఆ వృద్ధ దంపతుల వంక చూసింది. ప్రసన్నహనుమ అటే చూస్తున్నాడు. ఆ పాప వారి దగ్గరికి వెళ్ళి ఏదో చిన్నగా అడిగి, చేయి పట్టుకుని వారిని జాగ్రత్తగా రోడ్డు దాటించింది. అది చూసి కుదుటపడింది అతని హృదయం. సంతృప్తిగా నిట్టూర్చి కర్టెను సరిచేయబోతూ యధాలాపంగా ఎదుటవున్న బస్టాప్వైపు చూశాడు.
అంతే!
అతని కనురెప్పలు మూతపడలేదు.
Typical suryadevara novel.
Good