-
-
మునెమ్మ
Munemma
Author: Dr. Kesava Reddy
Publisher: Hyderabad Book Trust
Pages: 113Language: Telugu
Description
పురుషుడు మాత్రమే బలమైనవాడు, బుద్ధికుశలుడు, అన్యాయాలని సరిదిద్దగల్గినవాడు, కథని తన ఉనికితో ముందుకి నడిపించగలిగినవాడు, పురుషుడే నాయకుడు...... పోరాటయోధుడు.... అన్న పాపులర్ దృక్పథం నించి విడివడి.... మునెమ్మ లాంటి సాధారణ స్త్రీలోని అసాధారణ శక్తిని బయటకు తీసి కథని నడిపిస్తారు రచయిత.
- జయప్రభ
మునెమ్మ జయరాముడిని ఏకాంత క్షణాల్లో మోహం కమ్మిన వేళల్లో 'పిలగాడా' అని సంబోధిస్తుంది. జయరాముడి మరణం తరువాత బొల్లిగిత్తను కూడా 'పిలగాడా' అనే పిలుస్తుంది. పరోక్షంగా భర్త మరణానికి కారణమైన బొల్లిగిత్త... ఆ భర్త స్థానాన్ని భర్తీ చేయడం నవలగా ఈ కథాంశం సాధించిన పోయెటిక్ జస్టిస్.
- అంబటి సురేంద్రరాజు
Preview download free pdf of this Telugu book is available at Munemma
మనిషి లోని మృగత్వం కనిపించింది
మృగం లోని మనిషితనం కనిపించింది
అత్యంత సామాన్యమైన మునెమ్మ అంతే సామాన్యంగా కనిపిస్తూ చేసిన అసామాన్య పోరాట గాథ
నేనూ ఆమెతో మానసిక ప్రయాణం చేసి అలసిపోయాను
మీరూ ప్రయాణం కొనసాగించండి