-
-
పరాశర స్మృతి
Parasara Smrithi
Author: Dr. N. L. Narasimhacharya
Publisher: Gayathri Prachuranalu
Pages: 108Language: Telugu
ఈ పుస్తకం గురించి
కలౌ పారాశరః స్మృతిః అంటూ కలియుగంలో ఉన్నవారు ఆచరించాల్సిన అనేక ధర్మాలు ఇందు తెలుపబడ్డాయి. పరాశరస్మృతి, మనుస్మృతి ఆపస్తంబ ధర్మసూత్రము మొదలైన వాటికంటె అర్వాచీనమైంది. అందువల్లనే కొంత నవీనదృక్పథం ఇందు కనిపిస్తుంది.
ఆయా యుగాలననుసరించి ధర్మాలు మారుతాయి. కావున ధర్మ వివేచన కూడా కాలానుసారంగా చేయాల్సిందే తప్ప, అరకొరగా తమకు తెలిసిన ధర్మాలననుసరించి ఇతరులను తప్పుపట్టుట సరియైనది కాదు.
మానవుడు తన సంపాదనలో రాజుకు ఆరవ భాగాన్ని, పూజాది ధర్మ కార్యక్రమాలకు 21వ భాగం. దాన ధర్మాలకు 30వ భాగం (ఈ విధంగా సుమారు 8శాతం) తప్పక వినియోగించాలి. ఈ విషయంలో రాజు, వైశ్యుడు,బ్రాహ్మణుడు అనే భేదం లేదు.
స్త్రీ విషయంలో కఠినమైన నియమాలు చెప్తూనే కొన్ని సమయాలలో స్త్రీలకు పునర్వివాహం చేయవచ్చునని అంటాడు. స్త్రీలకు రెండంగుళాల మేర జుట్టు కత్తిరిస్తే చాలు వెంట్రుకలన్నీ గొరగవలసిన అవసరం లేదంటాడు. ప్రాయశ్చిత్తములను కూడా స్త్రీ ఒంటరిగా చేయరాదు. శ్రమైక జీవి అయిన శూద్రుడు కూడా ప్రాయశ్చిత్తంగా ఉపవాసం ఉండకూడదని చెప్తూంది.
బ్రాహ్మణుడు తన ధర్మాలను సక్రమంగా నిర్వర్తింపకపోతే అతడు నామధారక విప్రుడని అవహేళన చేస్తాడు.
న్యాయవిచారణ చేయాలంటే ముగ్గురు, ఐదుగురు లేక పదిమంది ఉన్న ధర్మ పరిషత్తు అవసరము. న్యాయం గురించి సరియైన జ్ఞానం లేక తనకు తోచినట్లు న్యాయం చెప్తే, తప్పు చేసిన వానిపాపం న్యాయం చెప్పిన ధర్మ పరిషత్సభ్యులకు చెందుతుంది.
కొన్ని ప్రాయశ్చిత్తములందు తప్ప పురుషుడు కూడా తలయంతా గొరిగించుకొనవద్దు. గాయత్రీ జపం చేయని ద్విజుడు అపవిత్రుడు. గాయత్రి జపం చేస్తూ వేదాధ్యయనం నిత్యం ఆచరించేవాణ్ణి లోకం బాగా ఆదరిస్తుంది.
అన్నకంటె ముందు తమ్ముడు వివాహమాడరాదు. ఆ విధంగా వివాహమాడ్తే, పిల్లనిచ్చిన వానికి, పెండ్లి చేసికొన్న వానికీ పాపం కలుగుతుందని చెప్తూనే కొన్ని ప్రత్యేక సమయాల్లో ముందు వివాహం చేసికొన్నా తప్పులేదంటాడు.
ఇటువంటి అనేక విషయాలు ధర్మవిషయమైన సందేహాలు చాలా తీర్చడం కనిపిస్తుంది. ఇటువంటి అమూల్యమైన అనేక విషయాలు పాఠకుని శ్రద్ధ, ఆసక్తులవల్ల తెలుస్తాయి.
- ₹162
- ₹540
- ₹360
- ₹270
- ₹360
- ₹162
- ₹162
- ₹540
- ₹360
- ₹270
- ₹360
- ₹162
This book provides with list of don'ts than do's and there seems no reasoning given for each. This book seems proposing mere belief without proper reasoning. There are many instances where the reader may think that these are list mere beliefs and no reasoning. Many are impractical and illegal as well as per today's constitution of India (example marriages at the age of 12 years). My request to author this book may be good in the context of time when it was proposed, however for present era it seems impractical and illegal in many scenarios. My sincere apologies if I sound no relevance, I just shared what I felt after reading the book.
wounder full book
good book. this book is just one example how ancient Indians had tough laws for well being of society. though some of the rules can't be followed in current days as per democratic rule, some of them are very good to follow.
ebook download is hectic process..reader has to download third party apps to read e book. in that case kinige should mention that in free preview books. free preview downloading instantly but paid rented book not downloading instantly asking for third party app.