• Misimi March 2011
 • Home delivery

  • fb
  • Share on Google+
  • Pin it!
 • మిసిమి - మార్చ్ 2011

  Misimi March 2011

  Author:

  Publisher: Bapanna Alapati

  Language: Telugu
  Rating
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 votes.
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 premium votes.
Description
సంపాదకీయం

మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలనంతరం పాశ్చాత్యదేశ ప్రజల జీవన విధానంలో, ఆలోచనాధోరణిలో మౌలికమైన మార్పులు వచ్చాయి. ఈ జీవితం, ఈ ప్రపంచం శాశ్వతం కాదనే తాత్త్విక ధోరణితో పాటు అర్బన్ ఎలియనేషన్, అస్తిత్వవేదన, ఎక్సిష్టెన్సియలిజమ్ లాంటి ఆలోచనాసరళితో మిళితమైన తత్త్వ సిద్ధాంతాలు వెలికి వచ్చినాయి. మరో ప్రక్క తాము కొత్తగా చెప్పగల సత్యమేదీలేదని ప్రాచీన తాత్వికులను అధ్యయనం చేస్తే సరిపోతుందనీ కనుగొన్నారు.

పై విషయాలు భారతీయ దర్శనాలకు భాష్య ప్రవచనాల సంప్రదాయంలోనే వున్నవి. కొత్త సచ్చిదానందమూర్తి తమ విస్తృత రచనలలో ఇదే విషయాన్ని, వేయి సంవత్సరాలుగా ఏ తాత్విక దర్శన ప్రతిపాదనలేకపోవటాన్ని - ప్రాచీన భారతీయ దర్శనాలను లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరాన్ని మరీ మరీ చెప్పారు. పద్మవిభూషణ్ గౌరవాన్ని పొందిన ఆయన స్మృతికి నివాళి సమర్పిస్తూ వాడ్రేవు చినవీరభద్రుడు సచ్చిదానందమూర్తి 'శ్రుత్యర్థ పర్యాలోచన' గ్రంథ ప్రాశస్త్యాన్ని విశ్లేషించారు.

తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన సి.పి. బ్రౌన్ పేర కడపలో గ్రంథాలయాన్ని - అధ్యయన కేంద్రాన్ని నెలకొల్పి అభివృద్ధి చేసిన 85 సంవత్సరాల జానమద్ది హనుమచ్ఛాస్త్రి పరిణితవాణిని వినవచ్చు.

ప్రపంచంలోనే అరుదైన శ్రీశైల శిఖరం, దేవాలయ సముదాయాలు, అక్కడకు చేరే దారుల చరిత్రను వివరంగా అందిస్తున్నాం.

భారతీయ ముస్లింల జాతీయభావాలను, వారి నిబద్ధతను విశ్లేషించి - పరిశీలించిన వ్యాసం దేవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డిది.

అరుదైన టిబెట్ వేదనా కవిత్వాన్ని దిలావర్ చరిత్రతో విశదీకరించారు.

ప్రతి మార్చి నెలలో లండన్ హైడ్ పార్క్‌లో 'వాటర్లూ' యుద్ధాన్ని మళ్ళీ 'ఎనాక్ట్' చేస్తారు. దాని నాయకుడు - ప్రతినాయకుడు నెపోలియన్ బొనాపార్టి ముఖచిత్రంతోపాటు ఆయన జీవన రేఖలు కూడా...

మే 17వ తేదీ బుద్ధజయంతి. మిసిమి మే నెల సంచికలో బౌద్ధతత్త్వం, చరిత్ర వ్యాపన సంబంధి రచనలను ప్రచురణకోసం ఆహ్వానిస్తున్నాము.

మిసిమి గురించి, వారి స్వంత మాటల్లో

భావి తరాలకు, కుటుంబమైతే ఆస్తిపాస్తులు, ఆధ్యాపకులు విద్యను, నాయకులైతే న్యాయమైన పాలనను, శాస్త్రజ్ఞులైతే వారి పరిశోధనా ఫలితాలను, మత గురువులైతే ఆధ్యాత్మిక చింతనను, ఇలా వారసత్వంగా సంక్రమింప చేయవచ్చు. ఇది సహజమూ సమ్మతమూను అయిన బాధ్యతే కదా!

మేము ఎటువంటి ఫలాపేక్ష లేకుండా సమాజానికి - అదీ ముఖ్యంగా మేధో వర్గానికీ, ముందుతరాలకు మార్గదర్శకంగా వుండే మేలైన సాహిత్య సంస్కృతీ పరమైన వ్యాసపరంపరలేగాక ఆలోచింపజేసే కవితలను, కన్నులకు ఇంపైన చిత్ర - వర్ణ చిత్రాలను, రసానందాన్ని అందించే అరుదైన సంగీత, సాహిత్య పరిచయాలను, స్ఫూర్తి ప్రదాతలైన వ్యక్తుల జీవన విధానాన్ని వారి మాటలోనే తెలియజేస్తూ ప్రచురిస్తామని, సేవాబద్ధులమై ఈ బృహత్కార్యాన్ని సంకల్పించి ఆచరణ లోనికి దిగాం. మమ్ములను ప్రోత్సహించవలసిన బాధ్యత మీ అందరిదీ - మేము అందించే మేధోపరమైన ఆదాయం - ఆనందదాయకం - ఎటువంటి బరువులేని చల్లని వెన్నెల - ఆరోగ్యకరమైన సముద్రపు గాలి, వినోద, విజ్ఞానపు ప్రసాదం.

మిసిమిని సంప్రదించడానికి

Bapanna Alapati
at Kala Jyothi Process Pvt. Ltd.,
1-1-60/5, R.T.C. 'X' Roads,
Musheerabad, Hyderabad - 500 020.
Ph. 040-27645536
E-mail : misimi_monthly@yahoo.in
Visit us at : www.misimi-monthly.com

Note: Download Free preview to read Table of Contents and other details.
Preview download free pdf of this Telugu book is available at Misimi March 2011