-
-
మారుతీయం
Maruteeyam
Author: Gollapudi Maruthi Rao
Publisher: Sahiti Mitrulu
Pages: 150Language: Telugu
Description
మీతో.......
ఏభై సంవత్సరాల ఊసులివి....
జీవితమంతా పంచుకున్న అన్ని రుచులూ -
తీపి, చేదూ, వగరూ, విగరూ, ప్రేమా,
చిరునవ్వూ, బాధా, కోపం, తాపం -
అన్నీ ఉన్నాయిందులో...
జీవితంలో ముసురుకున్న
ఎన్నో అనుభూతుల శయ్య ఈ కవితలు
కవిత ఆలోచనకి అందమైన ఫిలిగ్రీ నేత
మనసు చుట్టూ మన్నికయిన బంగారు మలామా
ఉగాది కవి సమ్మేళనాల్లో
డైరీల తొలిపేజీల్లో
ప్రేయసి గుస గుసల్లో
దూరమైనప్పుడు నిట్టూర్పుల్లో
కన్నకొడుకు కలిసిరాని దుఃఖంలో
విదేశాల్లో విమానాల్లో
ఆలోచనను అక్షరాల్లో అల్లిన జవుళి ఇది...
A muse అనుభూతి చేసే ruse -
ఇందులో స్మృతులూ, నివాళులూ
విసుర్లూ, కసుర్లూ, జీమూతపు గుబుర్లూ
ఎన్నో.... ఎన్నో.....
ఓ జీవితకాలపు అనుభూతుల్ని
అంతే సరసంగా, ఉదారంగా పంచుకుంటారని......
- గొల్లపూడి మారుతీరావు
Preview download free pdf of this Telugu book is available at Maruteeyam
మారుతిరావు గారు ఒక అద్భుత నటుడు, సామాజిక చేయూతగానే తెలుగు గానీ, వారిలో ఒక ఉన్న మరో కోణం ఈ పుస్తకం ద్వారా తెలిసింది... నన్ను కదిలించిన నాలుగు వాక్యాలు ముచ్చటగా ఇక్కడ...
జగమునకు దివ్విటీ పట్టు పగలు కన్న
కాంత కౌగిట కరగు చీకటులు మిన్న
నాటి రేయి నిను చూచినాను గాని
ఎరుపు పెదవులు, చూపులే గురుతు నిలిచె
బ్రతులు బాధను వరియించి గతుకు వార
బాధ కవితను వరియించి యతుకు వేసె
పయిట గాలికి ఎగిరిన పల్లె దాన
పయిరు పరికించు ! పంటంత నేను కోతు......
- ప్రవీణ్ కుమార్ నందగిరి
CAN ANYONE LZ SUGGEST ME HOW TO OPEN DOWNLODED BOOK. MY SYSTEM IS NOT SUPPORTING THE FORMAT
POEMS OVER 50 YEARS – Book review on “Maruteeyam”
http://enblog.kinige.com/?p=2043
ఈ కవర్ పేజీకి పుస్తకానికి సంబంధం ఏమిటండీ?