-
-
అహో! విక్రమార్క
Aho Vikramarka
Author: Suryadevara Rammohana Rao
Publisher: Madhu Priya Publications
Pages: 430Language: Telugu
అర్ధనిమిలితుడై ఏదో ఆలోచిస్తున్న ఆ వ్యక్తివైపు శివస్వామి మౌనంగా చూస్తూ-
''ఇంతకీ తమకు ఏం కావాలి?'' అడిగాడు.
పెదవి విప్పాడాయన.
''చావు గురించి తెలియజేసే మృత్యుకాండ... వచ్చే జన్మ గురించి తెలియజేసే పునర్జన్మ కాండ... వివరాలు తెలియజేయగలరా?'' అడిగాడా వ్యక్తి ఎక్కడో ట్రాన్స్‌లో వున్నట్లుగా.
అది వింటూనే షాక్ తిన్నాడు శివస్వామి. అయినా క్షణాల్లోనే తేరుకున్నాడాయన.
''నేనదే మీతో మనవి చేయాలనుకుంటున్నాను. ఎంత గొప్ప వ్యక్తి వచ్చి అడిగినా, మేం చెప్పలేని, చెప్పకూడని కాండాలు ఆ రెండే! ఎందుకంటే మా పూర్వీకులు విధించిన నిబంధన అది. ఆ నిబంధనకు మేం కట్టుబడి వున్నాం. ఒకవేళ చెప్పినా పూర్తి వివరాలు చెప్పకూడదు. ''
''నేను ఎక్కడ నుంచో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది మరుజన్మ గురించి వివరాల కోసమే...''
ఆ హాల్లో ఇద్దరి మధ్యా మౌనం. భారంగా కదులుతున్న వూపిరి కదలికలు.
''మరుజన్మ గురించి వివరాలు అంటే - పునర్జన్మ కాండం కోసమా?'' శివస్వామి నేత్రాలు ఆశ్చర్యంతో విశాలమయ్యాయి.
''అవును!''
''జనరల్‌గా మీరు పునర్జన్మ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? లేక ప్రత్యేకంగా మీ పునర్జన్మ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?'' ఆసక్తిగా ప్రశ్నించాడు శివస్వామి.
''నా పునర్జన్మ గురించే...'' శాసిస్తున్నట్లు గంభీరంగా అన్నాడా వ్యక్తి.
Very Nice Novel
Can you ptovide ebook version of the same?
This novel is very boring...
is there an ebook to rent/purchase this?
can you give print book?