• A B C D
  • fb
  • Share on Google+
  • Pin it!
 • ఎ..బి..సి..డి..

  A B C D

  Pages: 383
  Language: Telugu
  Rating
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  '4/5' From 1 votes.
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

రాత్రింబవళ్ళూ సొరంగం తవ్వటానికి శ్రమిస్తున్న నలుగురు వలసరవాక్కంలో పది నెలలుగా నివాసం ఉంటున్న ప్లాట్‌కి చేరుకున్నారు. వస్తూనే బిర్యానీలు, మందు సరంజామా తెచ్చుకున్నారు. స్నానం కానిచ్చి నలుగురు ఒక గదిలో సెటిల్ అయిపోయారు.

ముందుగా తలో పెగ్ తీసుకొని కబుర్లలో పడ్డారు.

“తవ్వి తవ్వి గూడలు పడిపోతున్నాయి... ఇంకెన్నాళ్ళకు బీడీ బిల్డింగ్ క్రిందకి చేరుకుంటాం...?” అందులో ఒకడన్నాడు.

“మనం మొదలెట్టిన కంప్యూటర్ షాపు నుంచి టిఫిన్ సెంటర్ దాటేసాం. ప్రస్తుతం మున్నా బార్ కూడా దాదాపు దాటేసాం. కూరగాయల షాప్ దాటేసాం అంటే బీడీ బిల్డింగ్ క్రిందకి వెళ్ళినట్టే...” అన్నాడు రెండో వ్యక్తి.

"ఆ చంద్రగాడేంటిరా అలా కాట్లకుక్కలా అరుస్తాడు...?” మూడోవాడు విసుక్కుంటూ అన్నాడు.

“మనం యాభై అడుగుల లోతున సొరంగం తవ్వుతున్నామంటే వాడి జాగ్రత్తే కాపాడింది. పైనున్న షాప్స్ ఓనర్స్‌కి, స్టాఫ్, కస్టమర్స్‌కి అనుమానం వస్తే మన బతుకు బీహారే. అయినా ముందు ఈ పనికి తలా యాభై లక్షలని ఒప్పందం జరిగాక, మన శ్రమ చూసి ఒక్కొక్కరికి యాభై లక్షలు పెంచటమే కాకుండా నెలకి లక్ష చొప్పున ఇస్తున్నాడు. తిండి తిప్పలు, ఈ ప్లాట్ రెంట్, మందు సరంజామా అంతా తనే చూసుకుంటున్నాడు. అరవకేం చేస్తాడు...? గుట్టు రట్టయితే... మొత్తానికే మోసం...” నాలుగో వ్యక్తి అందర్ని మందలించాడు.

"సరి... సరి... సొరంగం తవ్వే అత్యాధునిక యంత్రాలు వచ్చాయి నిన్ననే... వాటితో పని అయితే సులభం... మరో రెండు నెలల్లో మనకప్పగించిన పనయిపోవచ్చు... నా అంచనా ఇది...” మొదటి వ్యక్తి అన్నాడు.

"అంతే... అంతే...” రెండోవాడు.

మూడో వ్యక్తి కలగజేసుకుంటూ- “ఈ రాత్రికి ఎక్కువ తాగొద్దు మనం. కొత్త యంత్రాల్ని సొరంగంలోకి చేర్చి ఫిట్ చేయాలి” అన్నాడు. "

"కరెక్ట్‌గా చెప్పావు... ఈ రాత్రి ఒంటి గంటకే ఆ పని...” అన్నాడు నాలుగో వ్యక్తి

Preview download free pdf of this Telugu book is available at A B C D
Comment(s) ...

There is no download option to purchase. What is happening now no one is responding to solve this issue?
Not running this website well recently. Please pay back my balance amount, if you are unable to resolve your website issues

There is no option to download the purchased books. Can some one please check and respond

There is no download option to purchase. What is happening now no one is responding to solve this issue?
Not running this website well recently. Please pay back my balance amount, if you are unable to resolve your website issues.Other wise Consumer Rites....Will meet at court.