-
-
అలీబాబా నలభై దొంగలు
Alibaba Nalabhai Dongalu
Author: Deevi Subbarao
Pages: 61Language: Telugu
అలీబాబా కూడా "తెరుచుకో సెసేమ్" అని బిగ్గరగా అరిచాడు.
అతను అలా అనటమే తడవుగా తలుపు తెరుచుకొంది. వేరే ఆలోచన లేకుండా అలీబాబాలోనికి వెళ్ళాడు. అక్కడో సొరంగం కనిపించింది. మనిషి ఎత్తు ఉన్న భూగృహం అది. రాతిని తొలిచి దాన్ని అట్లా తయారుచేశారు. పైన రాతి కప్పులో సన్నసన్న బెజ్జాలు ఉన్నవి. వాటిల్లోంచి గాలి వెలుతురు లోనికి జొరబడుతున్నది. చీకటి గుయ్యారంలా ఉంటుందని అనుకొన్న దొంగల గుహ వెలుతురు మయంగా ఉన్నది.
గుహ నిండా గుట్టలు గుట్టలుగా అనేక రకాల సామాన్లు, విలువైనవి. కింద పరచివున్నవి. పట్టువస్త్రాలు, వివిధ రంగుల్తో, నగిషీలతో ఉన్న తివాచీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నవి. ఇవేకాక,వెండి బంగారు నాణేలు అష్రఫీలు కూడా అలీబాబాకు కనిపించాయి. అవన్నీ రాసులు రాసులుగా కొన్ని నేలమీద పేర్చి ఉన్నవి. కొన్ని తోలుపెట్టెల్లో, గోనెసంచుల్లో పోసివున్నవి. అంతులేని విలువైన ఆ ధనరాసుల్ని, వస్తువుల్ని చూసి అలీబాబాకు ఎక్కడలేని ఆశ్చర్యం వేసింది. వీటినన్నిటిని ఇక్కడ ఇట్లా సేకరించి నిలువ చేయటానికి ఏ కొద్ది సంవత్సరాలో కాదు, కొన్ని తరాలు పట్టి ఉంటుంది. అని అనుకున్నాడు.
గుహ లోపల అలీబాబా ఉండగా, తలుపు దానంతట అదే మూసుకుపోయింది. అయినా అలీబాబా ఏ మాత్రం కంగారుపడలేదు. ఆ మాంత్రిక పదాలు అతడికి బాగా గుర్తున్నవి. తన చుట్టూతావున్న మిగతా విలువైన వస్తువుల్ని గురించి అతడు పెద్దగా పట్టించుకోలేదు. అతడి దృష్టి అంతా కేవలం ఒక్క అష్రఫీల మూటల మీదనే ఉంది. వాటిల్లోంచి, తన గాడిదలు ఎంత బరువు మోయగలవో అంత బరువుకు సరిపడా అష్రఫీల మూటలు తీసి బయటకు మోసుకొచ్చాడు. వాటిని ఆ గాడిదల మీద ఎక్కించాడు. అవి ఎవరికీ కనపడకుండా ఎండుకర్రల్ని వాటిమీద కప్పాడు.
ఇదంతా అయిపోయాక గుహద్వారం ముందు నిల్చోని, బిగ్గరగా "మూసుకో సెసేమ్!" అని అరిచాడు.
This book is now available in Tenglish script with Kinige. For details, click the link.