-
-
అదృశ్యవనం
Adrusya Vanam
Author: Sreesudhamayi
Publisher: Manrobo Publications
Pages: 156Language: Telugu
అనగనగా కథలు చిన్నప్పుడు చదివిన జానపద నవలలు ఇష్టపడనివారు ఎవరు. మాయలు మంత్రాలూ సంభ్రమాశ్చర్యాలకు గురించే టక్కుటమార విద్యలు. మాంత్రికుడు, పంచకల్యాణి మీద రాకుమారుడు. ఒకప్పటి ఆ జ్ఞాపకాలను ఇప్పుడు అక్షర రూపంలో జానపద నవలలుగా అందిస్తుంది మేన్ రోబో పబ్లికేషన్స్.
మూడేళ్ళ కాలంలో ఆరు జానపద నవలలు ప్రముఖ రచయిత్రి శ్రీసుధామయి రాసిన...
"జ్వాలాముఖి మంత్రాల దీవి" నుంచి "మాయాద్వీపం" వరకూ కినిగె పాఠకుల ఆదరణతో అన్ని నవలలు టాప్ టెన్‌లో కొన్నివారాలుగా నిలిచి మీ అభిమానాన్ని ఆదరణను స్వంతం చేసుకున్నాయి.
ఇప్పుడు ఏడవ జానపద నవలగా "అదృశ్యవనం" మీ ముందుకు వచ్చింది. ఒక్కసారి అలనాటి జానపద నవలా కాలంలోకి ప్రయాణించండి.
****
శ్రీఆంజనేయుడు విగ్రహం కనులు తెరుచుకున్నాయి.. లిప్తకాలం. ఒక్కసారిగా ఎవరో మంత్రించినట్టు వర్షం ఆగిపోయింది...కళ్ళు తెరిచిన గోపయ్య కనులు ఆశ్చర్యంతో ఆనందంతో పెద్దవయ్యాయి." కరుణించవా వాయుపుత్రా ? మరోసారి చేతులు జోడించి ఎడ్లబండిని సిద్ధం చేయడానికి ముందుకు కదిలాడు. అప్పుడే ఎదురుగా ఒక వృద్ధురాలు వచ్చింది.
" ఈ సమయంలో ఇంత రాత్రివేళ ఎవరూ ? అనుకుంటూ కళ్ళు చిట్లించి చూసాడు...
" ఎవరు అవ్వా ..ఇంత రాత్రివేళ ఈ వర్షంలో తుడుచుకుంటూ మా పల్లెకు వచ్చారు ? అడిగాడు గోపయ్య"
అప్పటికే ఆ అవ్వ గోపయ్య ఇంట్లోకి అడుగుపెట్టింది.
ఆధ్యంతం ఆసక్తికరం. కనులముందు నిలిచే అద్భుతాల జానపద ప్రపంచం
శ్రీసుధామయి
"అదృశ్యవనం"
అదృశ్యవనం టైటిల్ చూడగానే చదివేయాలనేట్టు వుంది.అతి తక్కువ వ్యవధిలో రచయిత్రి ఏడు జానపద నవలలు రాయడం రికార్డు.మిగితా నవలలు చదివాను.పచ్చలలోయ,భూతాదేవి బేతాళ మాంత్రికుడు,ముఖ్యంగా జ్వాలాముఖి మంత్రాలదీవి నవలలు చాలా బావున్నాయి.జానపద నవలలు అచ్చ తెలుగులో సరళమైన భాషలో చాలా బావున్నాయి.
మళ్ళీ జానపద నవలలను ఇప్పటితరానికి పరిచయం చేస్తున్న కినిగెకు ధన్యవాదాలు.రచయిత్రికి అభినందనలు.
పట్టువిడవకుండా చదివించే నవల.అతి తక్కువ వ్యవధిలో చక్కని శైలితో ఏడు నవలలు రాసిన శ్రీసుధామయి గారికి అభినందనలు.
ఇప్పటి తరానికి పరిచయం లేని జానపద నవలలు పరిచయం చేస్తున్నారు.జానపద నవలల్లో మీ శైలి అద్భుతం.
చిన్నప్పుడు జానపద నవలలు గుర్తుకు తెప్పించాయి.ఇప్పుడు మళ్ళీ ఈ ట్రెండ్ రావడం,ఇలాంటి నవలలు రాసే రచయితలు ఉండడం మన అదృష్టం.ఇలాంటి నవలలు మరిన్ని రావాలి.