-
-
జీరో డిగ్రీ
zero degree
Author: mohan rishi
Publisher: Compose Impressions
Pages: 128Language: Telugu
Description
"మోహన్ రుషి కవిత్వం దేన్నీ ప్రతిపాదించదు. సిద్ధాంతీకరించి రాద్ధాంతం చేయదు. అది చదువరుల సెన్సిబిలిటీని స్పృశిస్తుంది, హృదయాన్ని తాకుతుంది. తన నొప్పిని స్వీయ చేతన ద్వారా పాఠకునికి బదిలీ చేస్తాడు కవి."
"మోహన్ రుషి కవిగా దుఃఖితుడు. అందుకే దుఃఖ వివశత్వం అతని కవిత్వం నిండా దట్టంగా పరచుకుని వుంటుంది. విషాదపు జీర అతని కవిత్వాన్ని పట్టి ఇస్తుంది. కృష్ణశాస్త్రిలాగే విషాదంలో దాక్కున్న కవి ఇతడు. ఆపుకోలేని పాటను ఎడదలో మననం చేసుకుంటూ నిరంతరాయంగా 'ప్రవాస యాత్రారతి' సాగిస్తున్నాడు. పబ్లిక్ డిమాండ్ జోలికి పోకుండా సొంత వెతలను ధైర్యంగా పుక్కిట పడుతున్నాడు. లోలోతుల్లో మెలిపెడుతున్న మెలాంకలీని, చెప్పరాని బాధను లోకానికి జడవకుండా వెల్లడి చేస్తున్న ధీశాలి ఈ కవి."
- అంబటి సురేంద్రరాజు
గమనిక: "జీరో డిగ్రీ" ఈబుక్ సైజు 7.51 mb
Preview download free pdf of this Telugu book is available at zero degree
Login to add a comment
Subscribe to latest comments
