-
-
యుగపురుషుడు
yugapurushudu
Author: U. Vinayaka Rao
Publisher: Jaya Publications
Pages: 145Language: Telugu
వ్యక్తిగా, చలనచిత్ర ప్రచండశక్తిగా ఎదిగిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు డా. నందమూరి తారక రామారావు ఆరు పదుల నట ప్రస్థానాన్ని అక్షరాలలో పొదిగి, నేను అందించిన "యుగానికి ఒక్కడు" పుస్తకానికి మంచి ఆదరణ లభించింది.
ఎన్టీఆర్ జీవితం ఆయనే చెప్పుకున్నట్లు ఒక మహాసాగరం. అందులోంచి ఎంత తవ్వి తీస్తే అంత సమాచారం లభిస్తుంది. అయితే సమయాభావం వల్ల, "యుగానికి ఒక్కడు" పుస్తకంలో ఆయనకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇవ్వలేకపోయాను. అందుకే అదనపు సమాచారం, అరుదైన ఫోటోలతో దానికి ద్వితీయ భాగంగా 'యుగపురుషుడు' పుస్తకాన్ని అందిస్తున్నాను.
ఎన్టీఆర్తో ఎంతో సన్నిహితంగా మెలిగినవారు ఆయన గురించి చెప్పిన ఆసక్తికరమైన విషయాలతో పాటు విభిన్న పాత్రల పోషణతో విశిష్టనటునిగా ఎన్టీఆర్ ప్రతిభను చాటిన సినిమాల్లో ముఖ్యమైనవి ఎన్నుకుని వాటిని సచిత్రంగా, సవివిరంగా పేర్కొన్నాను .
"యుగానికి ఒక్కడు" పుస్తకాన్ని ఆదరించినట్లుగానే ఈ పుస్తకాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను.
- వినాయకరావు
You should have option to save in wishlist to purchase later
when will be yugapurushudu print book available?