• vinadaniko manishi
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వినడానికో మనిషి

    vinadaniko manishi

    Author:

    Pages: 108
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"ఎక్సలెంట్ వర్క్...." - యండమూరి వీరేంద్రనాథ్.

"వేయిపడగలు తర్వాత నాకు నచ్చిన పుస్తకం ఇదే..... " - కామేశ్వరరావు (ఆర్టిస్ట్)

"ఇది చదివిన వాళ్ళెవరూ కంటతడి పెట్టకుండా ఉండలేరు....." - రాజగోపాల్ (టీచర్)

* * *

వంశీకి ఆశ్చర్యంగా అసహజంగా అనిపించింది. ఆయన కోసం తనో వస్తువు తెస్తే తాతయ్య అంత నిర్లిప్తంగా ఎందుకు అందుకున్నాడు? "తాతయ్యా షాల్ బాగోలేదా?" చిన్నబుచ్చుకుంటూ అడిగాడు.

"షాల్‌కేంరా బ్రహ్మాడంగా ఉంది"

"మరి నచ్చనట్లుగా చూస్తున్నావేంటి?"

"వంశీ ఇప్పుడు నేను కావాలనుకునేది, కోరుకునేది గిఫ్ట్‌లు కాదురా...!" మారుతీరావు చిన్నగా దగ్గుతూ అన్నాడు.

"మరేంటి తాతయ్యా నీకిప్పుడు ఏం కావాలి?" తాతయ్య అలా అనడం వంశీకి అదోలా అనిపించింది. ఈ సమయంలో తాతయ్యకి తీరని కోరికలుగానీ, తీర్చుకోవాలనుకుంటున్న బాధ్యతలుగానీ ఏమయినా ఉన్నాయా? వంశీ తాతయ్యవైపు ఉద్వేగంగా చూశాడు.

"...నాకిప్పుడు కావలసింది... నాతో మాట్లాడే మనిషి... నేను చెప్పింది వినే, నా ఆలోచనల్ని పంచుకునే ప్రాణి..." మారుతీరావు తన మనసు విప్పి తను తపించేది దేనికోసమో తెలియజేశాడు.

తాతయ్య కోరిక విన్న వంశీ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అవసానదశలో వున్న తాతయ్య మాట్లాడే మనిషి కరువై ఎంత విలలాడుతున్నాడో అర్థమై చలించిపోయాడు.

Preview download free pdf of this Telugu book is available at vinadaniko manishi