-
-
విశ్వకర్మ ప్రకాశము
viSvakarma prakaaSamu
Author: M. Viswanatha Raju
Publisher: Sri Sai Vastu Publications
Pages: 244Language: Telugu
విశ్వకర్మ ప్రకాశము
మూలం: విశ్వకర్మ
తెలుగు: డా. ముదుండి విశ్వనాథరాజు
ప్రపంచంలోని ప్రాచీన వాస్తు కళాక్షేత్రములలో భారతదేశమునకు అత్యంత గౌరవపూర్వకమైన స్థానమున్నది. ఈ విషయమును మనము గర్వముతో చెప్పవచ్చును. దీనిలో ఏవిధమైన అతిశయోక్తి లేదు. శిల్ప, చిత్రకళలలో రాజభవన నిర్మాణరీతులత్లో భారతీయ వాస్తుసంపద అపూర్వమైనది.
ఆధునిక కాలంలో యాంత్రిక యుగంలో జీవించే మనుషులకు ప్రాచీన కళలు సిద్ధాంతములు తెలుసుకొనుటకు తగిన సమయము లేదు. అయినప్పటికీ ఉన్న సమయములొ కొంత సమయాన్ని కేటాయించి మన ప్రాచీన వాస్తు విశిష్టతను, దానిలో ఉన్న వైజ్ఞానిక సాంకేతిక జ్ఞానాన్ని గ్రహించవలసిన అవసరమెంతైనా ఉంది. ఆ అవసరాన్ని గుర్తించి సంప్రదాయ బద్ధమైన, వైజ్ఞానికమైన, ఆధ్యాత్మిక దృష్టికోణముతో లోకము యొక్క హితము కోరి రచింపబడిన ప్రథమ వాస్తుశాస్త్ర ప్రవర్తక గ్రంథమైన విశ్వకర్మ ప్రకాశమును అనువదించి మీ ముందుంచుటకు ప్రయత్నించితిని.
విశ్వకర్మచే రచింపబడిన ఈ విశ్వకర్మ ప్రకాశమను వాస్తుగ్రంథము పరమ ప్రామాణికమైనది. ప్రస్తుతం అనేక ఆధునిక వాస్తు గ్రంథములు బజారులో లభ్యమగుచున్నవి. అనువాద జ్యోతిష గ్రంథములున్నవి. కానీ సంప్రదాయ వాస్తు గ్రంథమొక్కటి లభించుట లేదు. నాకు తెలిసి ఇదే మొదటి అనువాద వాస్తు శాస్త్ర గ్రంథమని భావించుచున్నాను.
సాంప్రదాయబద్ధమైన, వైజ్ఞానిక రూపమైన ఈ విశ్వకర్మ ప్రకాశము చదివి పాఠకులు ప్రయోజనము పొందగలరను ఉద్దేశముతో అనువాద రచన మీ కందిస్తున్నాను. ఈ అనువాద పఠనము వలన ఏ కొంత ప్రయోజనము చేకూరినను నా ప్రయత్నము సఫలమైనదని భావింతును.
- భవదీయుడు
డా. ఎం. విశ్వనాథరాజు
we need print book