-
-
వేసవి వాన
vesavi vaana
Author: Vinnakota Ravisankar
Language: Telugu
రవిశంకర్ కవితా రచన ప్రారంభించి సుమారుగా రెండు దశాబ్దాలై ఉండవచ్చు. పదేళ్ళకొక సంపుటిని వెలువరిస్తున్నాడు. తెలుగులో ఏడాదికో రెండేళ్ళకో ఒక కవితా సంపుటిని వెలువరించక పోతే చాలా మంది కవులకు నిదురపట్టదు. ఇప్పటి కవితా సంపుటి నా ముందు మాట కోసం పంపి అప్పుడే రెండేళ్ళు అయింది. కాల గమనంలో తోచిన మార్పులు చేస్తూ మరొక ప్రతిని ఇటీవలే పంపాడు. ప్రచురణ కోసం ఆదుర్దాపడని ఈ కవిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. తన అనుభవాలను తన ఆలోచనలను వాటి ద్వారా తాను గుర్తించిన విశ్వసత్యాలను కవిత్వంలో ఆవిష్కరించాలనే తపనేకాని కవిత్వం ద్వారా ఏదో ఒక లాభం పొందుదామనే ఆశ ఇతనిలో కనిపించదు. అందుకే ఈ నాటి కవిలోకంలో రవిశంకర్ అరుదైన కవి.
ఈ పదేళ్ళలో రవిశంకర్ కవితా దృక్పథం మారలేదు. కవితా దృక్పథం మారని రవిశంకర్ రచనల్లో ఏమైనా గుర్తించదగిన మార్పులున్నాయా అని సహజంగానే ఎదురుచూస్తాము.
ఈ వ్యవధిలో అతని అనుభవాలు పెరిగాయి. ఆలోచనలు పెరిగాయి. కవితామార్గం విస్తరించింది. దానికొక కొండ గుర్తు ఇప్పటి కవితా ఖండికల పరిణామం పెరిగింది. కుండీలో మర్రిచెట్టు లో కవితా ఖండికలు తులనాత్మకంగా చెపితే మినీ కవితలకు కొంచెం సన్నిహితంగా ఉంటాయి. ఇప్పటి కవితా ఖండికలు తన అనుభవాలకు తగినట్లుగా పరిమాణం పెంచుకున్నట్లు కనిపిస్తాయి. అప్పటి కవితలను ఒక్కొక్కటే చదివిన తర్వాత అయ్యో అప్పుడే అయిపోయిందే అనిపించేది.
స్పష్టత కోసం ఇక్కడే ఒక విషయం చెప్పాలి. కవిత్వంలో క్లుప్తత సాధించదగిన గుణమే. అయితే నియత సంఖ్యాక పాదాలలోనే కవిత్వాన్ని కుదించాలనే నియమం పెట్టుకోనక్కర లేదు. తీసుకున్న వస్తువును బట్టి అది మినీ కవిత్వమో, మిడీకవిత్వమో, మాక్సీకవిత్వమో, దీర్ఘకావ్యమో అవుతుంది. కానీ ఫ్యాషన్ కోసం మినీ కవిత్వం, దీర్ఘకావ్యం రాయనక్కరలేదు. వస్తుగౌరవాన్ని బట్టి కవితారూప పరిమాణం ఉంటుంది. “వేసవి వాన” లో రవిశంకర్ కవిత్వం పరిమాణం పంచుకోవడం అవసరమైన పరిణామం.
.....ఈ రవిశంకర్ కవితలు అనంత భావలోకాలకు తెరచినద్వారాలు. ఆలస్యం చేయకుండా ప్రవేశించండి.
This book is now available in Tenlgish script with Kinige. For details, click the link.
Loved reading this collection!!