• vennela paarijaataalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వెన్నెల పారిజాతాలు

    vennela paarijaataalu

    Pages: 98
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వెన్నెల పారిజాతాలు

ఆదూరి సత్యవతీదేవి సాహితీ సౌరభం

ఆదూరి సత్యవతీదేవి గారి వివిధ రచనలను సంపుటీకరణం చేసి ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు అందిస్తున్నపుస్తకం ఇది.

ఈ పుస్తకంలో సత్యవతీదేవి గారి గీతాలు, సంగీతరూపకాలు, కవితలు, కథలు, వ్యాసాలు, అనువాదాలు, ఇంకా ఇతర రచనలు ఉన్నాయి.

* * *

"ఎంత ఎదిగిందీ ప్రపంచం?

కూటి కోసం కోటి విద్యలు. ఆ కోటిలో ఇదో విద్య! చూసి ఆనందించడానికి ఈ ప్రకృతిలో ఎన్ని సుందరదృశ్యాలు లేవు? ఎగిరే పిట్ట, పలికే చిలక, కొమ్మ చిగుర్న పరుగిడే ఉడుత, వికసించే పుష్పం, వాటిపై అందంగా వాలే సీతాకోకచిలుకలూ, కదిలే మబ్బులూ, కదలని కొండలూ నిత్యం చైతన్యవంతమైన ఈ ప్రకృతిలో ఆనందించడానికి ఎన్ని లేవు?

ప్రకృతిలోని సౌందర్యాన్ని మనసులో ముద్రించుకుని మానవ మేధతో చేసిన శిల్పాలు, పెయింటింగ్సూ, బొమ్మలు ఇంకెన్నో ఉన్నాయి. అవి చాలవూ ఆనందించడానికి?

నిన్నటిదాకా కలిసి మెలిగిన మనిషి శవమైతే భయపడే మనిషి ఒక నిర్జీవమైన చిన్ని ప్రాణిని ఇంట్లో అలంకరించుకొని, అందులో సౌందర్యాన్ని, అందాన్ని అవలోకిస్తున్నాడంటే నాగరికత ఎట్లా పరిణిమిస్తోందో వూహిస్తేనే భయమేసింది దయానిధికి.

Preview download free pdf of this Telugu book is available at vennela paarijaataalu