-
-
థ్రిల్లర్స్
thrillers
Author: Renigunta Uttam
Publisher: Self Published on Kinige
Pages: 35Language: Telugu
మిష్టర్ విఠల్... రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) కి చీఫ్! రష్యా నుండి వచ్చిన వ్యక్తి పేరు... కొచికోవ్! అతను ఒకప్పుడు కే.జీ.బి. (రష్యన్ గూఢాచారి సంస్థ)లో పనిచేసిన ముఖ్యమైన ఏజెంట్. ఆక్షణంలో అతనికి తెలియదు తను ఓ పద్మవ్యూహంలో చిక్కుకుపోతున్నానని!
- (ఓల్గా నుండి ప్రేమతో)
'దబ్' అన్న చప్పుడుకి రెస్టారెంట్లో వున్న వాళ్ళందరూ తలలు తిప్పి అటుకేసి చూసారు. మరక్షణం వాళ్ళందరూ కట్రాటల్లా బిగుసుకు పోయారు.
- (ద్రోహం)
మరో నాలుగు గంటలే తను బ్రతికి వుండటం తర్వాత తనని ఉరి తీస్తారు. మరణం కోసం ఎదురుచూడటం ఎంత దుర్భరం! అతనికి త్వరగా తనను ఉరితీస్తే బాగుండుననిపించేలా వుంది.
- (అతడు)
ప్రయాణంలో ఎప్పుడూ తన భార్య ప్రమద్వర ఆ సీట్లో కూర్చునేది. ఇప్పుడూ తనతోపాటే ప్రయాణం చేస్తోంది. కానీ కారు డిక్కీలో ముక్కలు, ముక్కలుగా చేయబడి!
- (ద ప్లాన్)
తాను తప్ప ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా కనిపించింది. అడవి కీచురాళ్ళ శబ్దంతో దద్దరిల్లుతోంది. ఇక లాభం లేదనుకుని గమ్యం వైపుకి అడుగులేయసాగాడు. ఆ క్షణంలో అతనికి తెలియదు దురదృష్టం తన్ను వెంటాడుతోందని!
- (విషకన్య)
రోడ్డు ప్రక్కనున్న చెట్ల నుండి వినిపించింది హృదయవిదారకమైన ఓ తీతువుపిట్ట అరుపు. గగుర్పాటుతో నా వళ్ళంతా వణికినట్లయ్యింది ఆ క్షణం. సర్దుకుని మరికొన్ని అడుగులు నడిచిన తర్వాత కుడివైపు నుండి నక్కల ఊళలు వినిపించాయి వికృతంగా. భయానకంగా వున్న వాతావరణానికి కావచ్చు... నా గుండె వేగంగా స్పందించడం ప్రారంభించింది....
- (67 నిమిషాల తర్వాత ?!)
ఆమె నగ్నంగా ఉంది! కంఠం నుండి కింది వరకు ఆమె శరీరం అంతా స్పష్టంగా కనిపిస్తోంది. విప్పారిత నేత్రాలతో మరింత కిందకు వంగి ఆమె ముఖం చూచే ప్రయత్నం చేసిన నాకు నిరాశే మిగిలింది. గ్రీకు శిల్ప సౌందర్యం కదులుతున్న భావన...
- (ఆత్మకథ)
“ప్లీజ్... నన్ను చంపకు” రోదిస్తూ వేడుకుంటోందామె. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న భయం ప్రాణభీతికి పరాకాష్టగా వుంది. నన్నేం చేయమంటావ్ భానూ? నువు చావకపోతే చట్టం నన్ను చంపేస్తుందే! ఐనా నీకు తెలియదూ... నేను నిన్నెంతగా ప్రేమించానో! ఊ...?” మంచం ప్రక్కనే వున్న చెక్కకుర్చీపై కూర్చున్న వ్యక్తి నింపాదిగా చుట్ట వెలిగించుకుంటూ అన్నాడు.
- (ఖలుడు)
చంద్రుడ్ని మింగిన రాహువులా వుంది రాత్రి. కీచురాళ్ళ చప్పుడు భయానకంగా వుంది. రాజప్రసాదంలో హఠాత్తుగా దీపాలు ఆరి పోవడంతో చుట్టుప్రక్కలంతా అంధకారం అలుముకుంది. తగిన సమయమని భావించిన దేవేంద్రపాత్రుడు పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ పొదలమాటు నుండి బయటికి వచ్చాడు. నల్లని వస్త్రాలు ధరించి వుండటంతో చీకటిలో అతని ఉనికిని గుర్తించడం దుర్లభం. అతను చాలా సులభంగా కోట పరిసరాల్లో కలిసి పోయాడు.
- (కుట్ర)
....ఇక చదవండి!
I really like the stories he has written. It's a worth of reading and i really wish best for his future stories. This stories are fresh and can be converted into movies. Amazing. I love this! Love from USA
The content of this Book is not available. It errors out with Unable to Download message