-
-
తెలుగు వాగ్గేయకారుల భక్తి సంగీత సంప్రదాయములు-ప్రయోగములు
telugu vaggeyakarulu bhakti samgeeta sampradayamulu prayogamulu
Author: Dr. Y. Krishna Kumari
Publisher: Self Published on Kinige
Pages: 162Language: Telugu
పరమాత్మ నుంచి ఏదో కారణాన విడివడిన జీవుడు సంసార చక్రంలో ఎంతగా పరిభ్రమించినా, ఎప్పటికైనా ఆ పరమాత్మని చేరుకునే ప్రయత్నం చేయాలి. లౌకిక బంధనాల నుండి విడివడి పరమాత్మను చేరుకోవలన్న తపన కలగాలి. ఆ తపనే ఉపాసనా మార్గాన్ని సుగమం చేస్తుంది.
ఆ ఉపాసనా మార్గాలలో భక్తి అత్యుత్తమ సాధనమని (మోక్షసాధన సామగ్రాం భక్తి రేవ గరీయసి), ఆ భక్తి సాధించలేనిదేదీ లేదని (కింనకరోత్యహా) అన్నారు ఆదిశంకరులు. ఇంతటి విశేషమైన భక్తి జీవుడికి కుదరాలంటే నాదోపాసనే గతియని నిరూపించినవారు వాగ్గేయకారులు. ఓంకార నాదానుసంధానమైన గానాన్ని ఉపాసించి వాక్కును గేయాన్ని భక్తి రసామృత ధారలుగా పోసి పరమాత్మ పాదాలను కడిగిన పుణ్యజీవులు వాగ్గేయకారులు.
ఇటువంటి వాగ్గేయకారుల భక్తి సంగీత సంప్రదాయాల గురించి, ప్రయోగాల గురించి అయిదు అధ్యాయాలుగా విశ్లేషించి కృష్ణకుమారి వ్రాసిన గ్రంథమిది.
ఈ గ్రంథం చదివితే మదిలో ఆ శారదాదేవి దర్శనం ఇస్తుంది. మనలో ఏదో తెలియని ఒక నూతనోత్సాహం ఆత్మానందం కలుగుతుంది
- డా. సుధ
