-
-
స్వర్ణముఖీ సవ్వడులు
swarnamukhee savvadulu
Author: shashi kala.vayugundla
Publisher: Self Published on Kinige
Pages: 55Language: Telugu
స్వర్ణముఖీ సవ్వడులు అనేది 108 నానీలున్న పుస్తకం. ఇది కవయిత్రి శశికళ గారి రెండో కవితా సంకలనం.
* * *
పూలతీగకు
చెట్టు ఆసరా
రుణం తీర్చుకుంది
పరిమళంతో...
వేణువయ్యింది
మనస్సు
బాల్యపురేణువులను
తలచుకోగానే
సముద్రం
నాన్నలాంటిది
పైకి గంభీరం
అడుగున మమకారం
అనుబంధాలు
ఇగిరిపోతున్నాయి
కనిపించని
స్వార్థం సెగల్లో
భూమి
తడిసిపోయిందని చెప్పానా!
అవును
రైతు కన్నీళ్ళతో
* * *
నానీలు రాయడమంటే నాలుగు పాదాలను ఇష్టం వచ్చినట్లు పేర్చడం కాదు. 20-25 అక్షర సంఖ్యను పాటించి తృప్తిపడటం కాదు. నాలుగు పాదాల్లోని తొలి రెండు పాదాల్లో ఒక భావాంశాన్ని, మలి రెండు పాదాల్లో మరో భావాంశాన్ని గుర్తించి వాటి రెండిటి మధ్య ఒక విశిష్ట సంబంధాన్ని మెరిపించడం. ముఖ్యంగా రెండో భావాంశంలో ఒక చురకను (Punch) సాధిస్తే ఆ నానీ రాణిస్తుంది. శ్రీమతి శశికళ నానీలు చాలావరకూ ఆ పద్ధతిలోనే కుదిరాయి. దేశీయత, భావుకత, అభివ్యక్తిరమ్యత ముప్పేటగా అల్లుకున్న శ్రీమతి శశికళ నానీలను విశాలమైన నానీల సాహితీ కుటుంబంలోనికి ఆహ్వానిస్తున్నాను.
- డా. ఎన్. గోపి
