-
-
సురపురం
surapuram
Author: Meadows Taylor
Publisher: Rajachandra Foundation
Pages: 163Language: Telugu
సురపురం
మెడోస్ టైలర్ ఆత్మకథ, అనువాదం: జి. కృష్ణ
టైలర్ మహానుభావుడు. తెలుగువారికి సన్నిహితుడు. లివర్పూల్లో జన్మించి, 1823 ప్రాంతంలో భోగ్యం పండించుకోడానికి భారతదేశం వచ్చినాడు. బొంబాయిలో వ్యాపర సంస్థలో కొన్నాళ్ళు పనిచేసి, నిజాం సైన్యంలో చేరి అచిరకాలమున మహోన్నత పదవినధిష్టించినాడు. నిజాం అసఫ్జాహి వంశీయుడు, లాక్షణికంగా అతనిది మహమ్మదీయ రాజ్యమైనా దానిలో ప్రధాన భాగం తెలుగు మండలం. టైలరు జీవితం నిజాం రాజ్యానికి అంకితమయింది. కనుక ఆయన చరిత్ర తెలుగు చరిత్రయే. మన దేశానికి వచ్చిన విదేశీయులు తమ యాత్రానుభవములను వ్రాసినట్లే టైలర్ తన జీవిత కథను "The Story of my life" అను పేర ప్రకటించినాడు. ఇదే 'సురపురం' మెడోస్ టైలర్ ఆత్మకథ. జీవితంలో ఉద్యోగదశ భారతదేశ చరిత్రతో పెనవేసుకొన్నది. సురపుర సంస్థాన విశేషములు, బేడర్లు, అరబ్బులు, రోహిళ్ళూలు, రాజకుమారులు, నిజాం చరిత్ర, జాగీర్దారుల వృత్తాంతము, విద్రోహచర్యలు, 1857 నాటి విప్లవము ఇవీ అవీ అననేల పందొమ్మిదవ శతాబ్ది రాజకీయ సాంఘిక చరిత్రకు ఈయన ఆత్మకథ రమణీయమైన దర్పణం.
