• siMhaala pETa
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సింహాల పేట

    siMhaala pETa

    Author:

    Publisher: Perspectives

    Pages: 136
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 premium votes.
Description

'కారుణ్యం లేక అద్భుత సృష్టికి అనర్హమైన' మగజాతిని తోడేళ్ళ పాల్జేసిన పేరడాక్సుడు, చీమలపేట మీదుగా వెండి లోకం దాటీదాటని కాఫ్కీయుడు రమణజీవి. వస్తుగతరూపశైలి వ్యథలై బద్దలైన అద్దం ముక్కలు. 'మానవసృష్టిలో ఉన్న మూస దనా'న్ని ఈ రచయితలానే వెక్కిరిస్తున్న గాజుపెంకులు, లక్షలమంది తడికళ్ళలో సముద్రం ప్రతిబింబించినట్టు, అదే ఉద్వేగ స్థాయిలో ఆ పాదరస బిందు సమూహంలో ప్రతిఫలిస్తున్నాడు రచయిత.

రమణజీవి ఉన్మత్తతీవ్రత అర్థం కావాలంటే, ప్రళయోధృతిలో పోటెత్తుతున్న సముద్ర నీలి బీభత్స సౌందర్యాన్ని ప్రణయావేశంతో చూసి, 'అడుగో నా కృష్టు'డంటూ దూకేసిన చైతన్యుడి తాదాత్మ్య ఉన్నాదం అర్థం కావాలి. సన్నమూతి గాజుసీసా పగలగొట్టకుండా, లోన బాతుని చావకుండా బయిటకి తీయడానికి - 'యోచన'కీ 'గ్రహించడాని'కీ మధ్య అగాథాన్ని ఏ వంతెనల వైఫల్యంతో కాకుండా, ఒక్క అదాటున దాటేటువంటి వివేక స్థాయిలో దాన్ని అందుకోవాలి.

- నరేష్ నున్నా

Preview download free pdf of this Telugu book is available at siMhaala pETa