-
-
సేద్యం
sedyam
Author: Eqbal Pasha
Publisher: Palamuru Prachuranalu
Pages: 234Language: Telugu
ఈ ముప్ఫై ఏళ్ళ ఇక్బాల్ కవిత్వం చదువుతుంటే నాలో చాలా చలనాలు, స్పందనలు కలిగాయి. మూడు దశాబ్దాల్లో మళ్ళీ ప్రయాణం చేసినట్టు మళ్ళీ ఆ చారిత్రక, సామాజిక, రాజకీయ సందర్భాల్లో జీవించినట్లు, సంచరించినట్లు, పునః అనుభవాన్ని, మననం చేసుకున్నట్టు ...
ఇక్బాల్ పాటెత్తుకున్నా, కవిత ఎత్తుకున్నా చాలా హాయిగా, నట్టు గొట్టకుండా నడిపించే ఒక లక్షణాన్ని పుణికి పుచ్చుకున్నాడు.
Identity crisis గానీ, ideological crisis గానీ, ఇక్బాల్‌కి ఎక్కడ లేవు. కాబట్టే ఒక స్పష్టత. ఒక క్లారిటీ, ఒక తేజస్సు, చెప్పేదాని మీద అనుమానం లేకపోవటం, సంశయాలు లేకపోవడం. ఒక మార్గమెన్నుకున్నాడు. ఆ మార్గాన్ని ధైర్యంతో అనుసరిస్తున్నాడు, ఆచరిస్తున్నాడు.
- కె. శివారెడ్డి
దశాబ్దాల మార్కెట్ మాయాజాలానికి బలైనంక
ప్రపంచీకరణకు పరుగులు తీస్తున్న
మీ ప్రజాస్వామ్యం తేలిపోయాక
మాకర్థమయ్యిందిప్పుడు
మా సమాధులపై
సుందర భవంతుల స్వప్నాలు కంటున్న
మీరంతా డాలర్ కుక్కలని
మా పసిడి పంటల బతుకులపై వాలిన చీడలని
మాకు బాగా అర్థమయ్యింది
సేద్యం చెయ్యడమంటే
యుద్ధం చేయడమేనని
