-
-
సరిలేరు నీకెవ్వరు
sarileru neekevvaru
Author: Lanka Nagendra Rao
Publisher: Self Published on Kinige
Pages: 157Language: Telugu
Description
మహానటుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్బంగా "సరిలేరు నీకెవ్వరు" పుస్తకంపై 58.33% ప్రత్యేక తగ్గింపు. ఇది పరిమితకాల ఆఫర్.
* * *
చలన చిత్ర చరిత్రలో మహోన్నతులు ఎన్.టి.ఆర్ ధరించిన అనేక పాత్రల అభినయ చతురత, ప్రపంచ సినీ చరిత్రలో ఆయన సాధించిన సంచలన విజయాల విశిష్టత, అరుదయిన అపురూప దర్శకుడిగా ఆయన నిపుణా సంపన్నత, అలాగే శ్రీ ఎన్.టి.ఆర్ గురించి సినీ, రాజకీయ, విద్యావంతుల అమూల్యమైన అభిప్రాయాలు... ఇలా అనేక విశేషాల సమాహారంగా తీర్చిదిద్దిన ఎన్.టి.ఆర్ సినీ స్వర్ణ చరిత్ర "సరిలేరు నీకెవ్వరు" అందరినీ అలరిస్తుందని ఆశిస్తూ..........
- రచయిత
గమనిక: "సరిలేరు నీకెవ్వరు" ఈ-బుక్ సైజ్ 35.4 MB
Preview download free pdf of this Telugu book is available at sarileru neekevvaru
ఎన్ టి అర్ పుస్తకాలలో తలమానికం. సరిలేరు నీకెవ్వరు పుస్తక రత్నం
శ్రీ కృష్ణ , శ్రీ రామ , బీష్మ , రావణ , దుర్యోధన , అర్జున , బృహన్నల , మరియు సాంఘిక, చారిత్రక , జానపద చిత్రాలలో పలు క్యారక్ట రైజేషన్స్ ను సుందర తెలుగులో అద్బుతమైన భాషా శైలితో పా ఠకులకు అందించిన రచయిత ధన్యజీవి. నూరేళ్ళ భారతీయ చలన చిత్ర చరిత్రలో హిందీ నుండి తెలుగు వరకూ అన్ని భాషలలోను అతిరథ మహారధు లైన సూపర్ స్టార్స్ మధ్య పోటిలో నేనొక్కడినే అంటూ ''greatest actor of all time in India'' గా సంచలన చరిత్ర సృష్టించి ఎన్నిక కాబడిన ఎన్ టి అర్ కు సరిలేరు నీకెవ్వరు అంటూ టైటిల్ పెట్టడం సముచిత నిర్ణయం. తెలుగు తెలిసిన ప్రతీ ఒక్కరు చదవాల్సిన పుస్తకం. ఇక ఆయన చిత్రాలు సృష్టించిన రికార్డుల వివరాలను అందరికి అందిచాలనే రచయిత తపన,కృషి నిజంగా హర్షణీయం. ఇంతటి విశేషమైన పుస్తకాన్ని అందించిన కినిగె.కామ్ వారికి అభినందనలు.
NTR gurinchi rasina prati Cinema jeevitam chala adbutanga rasaru rachayita..Hat off to Rachita..
మాటల ముత్యాల జల్లులో మైమరిపించిన సరిలేరు నీకెవ్వరు
పుస్తకంలోని ఎన్నో భాషా కుసుమాలు హృదయాన్ని పరిమళభరితం చేసాయి. పూర్తయిన తరువాత అయ్యో అయిపోయిందే అనే తీయని పెయిన్ కలిగింది. మహానట తారక రామాస్త్రాన్ని సరైన తీరులో సంధిస్తే లక్ష్య ఛేదన ఎంతటి ప్రకంపనాన్ని సృష్టిస్తుందో సరిలేరు నీకెవ్వరు నిరూపించింది .
మహా నటుడు ఎన్ టి యార్ మహోన్నత సినీ చరిత్రను అక్షర రూపంలో సైతం కనులకు కట్టినట్టుగా వ్రాసిన రచయితకు ధన్య వాదాలు. మన దేశం 1949 నుంచి శ్రీ నాధ కవి సార్వభౌమ 1993 వరకు సంవత్సరాలవారీగా ఆయా చిత్రాలను ముఖ్య మైన సన్నివేశాలు, సంభాషణలతో సమీక్షించిన విధానం అద్భుతం. మళ్ళీ ఆ చిత్రాలను వెంటనే చూడాలనే ఉత్సుకతను కల్పించారు. ఎన్ టి యార్ అభినయం లో ఓవర్ ప్లే - అండర్ ప్లే గురించి వివరించిన విధానం, సాంఘిక చిత్రాలలో ఛాలెంజింగ్ పాత్రలు లభించినప్పుడు ఎలా ఎలర్ట్ అయి నటించేవవారో అలాగే 1952లో హీరోగా ఆయన చిత్రాలు మాత్రమే ఎందుకు విశేషతను సంతరించుకున్నాయో, సంక్రాంతి సార్వభౌముడు ఎందుకు, ఎలా అయ్యారో, అలాగే శత, రజతోత్సవ, స్వర్ణోత్సవ, వజ్రోత్సవ వివరాలను కేంద్రాలతో సహా పొందుపరచడం , 33 యేళ్ళలో 24 యేళ్ళు ఆయా సంవత్సరపు పెద్దవిజయాలుగా సంచలనం సృష్టించిన వివరాలు, ఇయర్ మిస్ కాకుండా ఏకధాటిగా 33యేళ్ళు డైరెక్ట్ సెంచరీలతో సినీ పయనం. ఇలా సంచలన వివరాలను అందరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఆంధ్రదేశానికి వన్నె తెచ్చిన అసామాన్యుడు ఆయన. అందుకే ఆంధ్రులందరికీ ఆయన ప్రీతిపాత్రుడు .