“జీవజాలం అంటూ ఏమీ మిగలని ఈ రుద్రభూమిలో ఎనిమిది ఏళ్ళు కూడా పూర్తిగా నిండని చిన్నపిల్లడు వంటరిగా బ్రతకటం చాలా కష్టం అని నాకు తెలుసు. మీ నాన్నను ఆదర్శంగా తీసుకో చందూ... అతను ఎంత ధైర్యంగా నిలబడగలడో నువ్వు కూడా అదే మాదిరి రొమ్ము విరుచుకు తిరగాలి...” అన్నాడు రాజన్ వున్నట్లుండి.
“నీకు ఎంతో చదువు చెప్పి సూపర్ కంప్యూటర్‌గా తయారు చేద్దామని అనుకున్నాను నేను... తను పెంచుకొని తనంతటివాడిగా చేద్దామని ఆశించాడు డాక్టర్ అంకుల్. మా ఇద్దరి అంచనాలు తప్పు అని చాలా ఆలస్యంగా నాకు తెలిసింది....”
“మంచి అనే మాటకు మానవత్వం అనేపదానికి ఇప్పుడు ఈ సమయంలో అర్థంలేదని నాకు ఇప్పుడే అవగతం అయింది చందూ... ఈ శ్మశాన వాటికలో ఎవరైనా బ్రతకదల్చుకుంటే మంచితనం పనికిరాదు... చదువు సంధ్యలు అవసరం లేదు... కండబలం గుండె నిబ్బరం వుంటే చాలు...
“నువ్వు ఆ రెంటినీ అలవరుచుకోవాలి... దెబ్బకు దెబ్బ కొట్టగలిగే స్థితికి చేరుకోవాలి. వంటరిగా పదిమందిని ఎదిరించిన మీ నాన్న...” అంటూ సడన్‌గా మాటల్ని ఆపేశాడు రాజన్.
తన తండ్రి ప్రసక్తి వచ్చేసరికి ముందుకు వంగాడు చందు.
Post apocalyptic novel. You'll loose the excitment after reading 100 pages. Starting is good, but becomes typical 'Madhu Babu' novel after few pages with exaggerated dialogues and descriptions.