-
-
రసాయన జగత్తు
rasaayana jagattu
Author: Dr. Chaganti Krishna Kumari
Pages: 95Language: Telugu
డా. చాగంటి కృష్ణకుమారి గారు రసాయన శాస్త్ర రంగంలో ప్రఖ్యాతి గడించిన రచయిత్రి, పరిశోధకురాలు, ఉపన్యాసకురాలు. విజయనగరంలో పుట్టి, అక్కడే డిగ్రీ పూర్తి చేసి, ఆంధ్రాయూనివర్శిటీ రసాయనశాస్త్రంలో పిజి, డాక్టరేట్ డిగ్రీలను పొందారు. తొలుత విజయనగరం మహారాజా మహిళా కళాశాలలో ఉపన్యాసకురాలిగా చేరి 6 సంవత్సరాలు పనిచేసినా, కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కళాశాలలో రసాయణశాస్త్ర అధిపతిగా 30 సంవత్సరాలు వ్యవహరించారు. తెలుగు అకాడమిలో రెండు సంవత్సరాలు డెప్యుటేషన్‌పై చేరి పలు రసాయనశాస్త్ర పుస్తకాల ప్రచురణలకు, తెలుగు పత్రికలో సైన్సు విభాగానికి సంపాదకురాలిగాను, 2000 సంవత్సరం ఇంటర్మీడియట్ రసాయన శాస్త్ర పాఠ్యపుస్తకానికి ఒక రచయితగా ముఖ్య భూమికను నిర్వహించారు. 1993 నుండి ఆలిండియా రేడియోలో సైన్సు ప్రసంగాలను, 2007 నుండి ఇందిరాగాంధి ఓపెన్ యూనివర్శిటీ GYAN వాణి కార్యక్రమాలలో ప్రసంగాలను యిస్తూ, NCSTC వారి ఆధ్వర్యములో ఆకాశవాణిలో సీరియల్‌గా ప్రసారమయ్యే సైన్స్ ఎపిసోడ్లకు రచయితగా ఉన్నారు. “విద్యార్ధి చెకుముకి" బాలల సైన్స్ పత్రికకు సంపాదన సభ్యూరాలై ఆ పత్రికలో సైన్స్ క్రాస్ వర్డ్ పజిల్స్, సైన్స్ అవగాహనా పజిల్‌లను నిర్వహిస్తున్నారు. లోహ జగత్తు, వైజ్ఞానిక జగత్తు, మేధోమహిళ, భూమ్యాకర్షణకి దూరంగా, దూర దూరంగా... సుదూరంగా పుస్తకాలను రచించారు. సి.యన్.ఆర్.రావ్ గారి 'అండర్ స్టాండింగ్ కెమిస్ట్రీ'ని తెలుగులోకి అనువదించారు. సింగరేణి మహిళా కళాశాలలో అధ్యాపకురాలిగా ఆమె రూపొందించిన నమూనాతో 'రసాయనమూలకాల ఆవర్తనపట్టికతో ఆడుకొందాము రండి' శీర్షికను నిర్వహిస్తున్న ఆట విద్యార్ధుల అభిమానాన్ని, ప్రశంసలను అందుకొంటున్నది. ఇండియన్ సైన్స్ రైటర్స్ అసోసియేషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కెమిస్ట్స్, నేషనల్ సెంటర్ ఫర్ సైన్స్ కమ్యూనికేటర్స్ సంస్థలలో జీవిత సభ్యురాలుగా వున్నారు. డా.కృష్ణకుమారిగారికి రాష్ట్ర ప్రభుత్వపు సర్వోత్తమ అధ్యాపక పురస్కారంతోపాటు, ISWA సమ్మాన్, జమ్మిశకుంతల అవార్డ్లు కూడా లభించాయి. క్లిష్టమైన రసాయన శాస్త్రవిషయాలను చక్కని తెలుగులో సామాన్య పాఠకులకు ఆసక్తిదాయకంగానూ, సుబోధకంగానూ, సరళంగానూ చెప్పగల డా. చాగంటి కృష్ణకుమారి ప్రముఖ కధా రచయిత చాసో (చాగంటి సోమయాజులు) గారి కుమార్తె.
