-
-
రామాయణం మామయ్య
ramayanam mamayya
Author: Dr.Mantha Bhanumathi
Publisher: Self Published on Kinige
Pages: 174Language: Telugu
మంథా భానుమతి చక్కని అందమైన శైలితో వచనం వ్రాయగల మంచి రచయిత్రి. ఆమె కథ వ్రాసినా, నవల వ్రాసినా అది అందంగా, ఆహ్లాదకరంగా వుంటుంది. ఈ 'రామాయణం మామయ్య' పేరు విచిత్రంగానూ, సరదాగాను ఉంది. ఇది చిన్న నవల. ఇందులో భానుమతి కోనసీమ నేపథ్యంలో కథనంతా నడిపారు. ముఖ్యంగా అగ్రహారాలలో సుసంపన్నులైన బ్రాహ్మణ కుటుంబాలలోని సంప్రదాయాలు, ఆప్యాయతలు, అనురాగాలు, బాంధవ్యాలు అన్నీ ఎంతో చక్కగా చిత్రీకరించారు. పాత్రలన్నింటిలోనూ, గాఢమైన సంప్రదాయపు పట్టుదలలు వున్నా, మానవత్వంతో, సంస్కారంతో ఆలోచించే పాత్రల వివరణ బాగుంది.
రామాయణం మామయ్యగా పిలవబడే పెద్దాయన (వయసు దృష్ట్యా కాదు, బాధ్యతల దృష్ట్యా) ఒక క్రమశిక్షణా బద్ధుడిగా వుండి తన మాటమీదే అందర్నీ నడిపిస్తాడు. రామాయణం మామయ్య చెప్పినట్టుగా అందరూ వినాల్సిందే-నడుచుకోవాల్సిందే-అయితే ఆయన ఆలోచన, అంతరంగం సున్నితమైనవి - ఎవ్వరినీ ద్వేషించటం, పగ సాధించటం ఆయన కస్సలు లేవు.
శ్రీమతి మంథా భానుమతి హాయిగా, కులాసాగా రచన చేస్తారు. పాఠకుల్ని సమస్యలతో ఉక్కిరి బిక్కిరి చెయ్యరు. సమస్య వస్తుంది. కానీ అది దూదిపింజలా విచ్చుకుని పోతుంది. ఇందులో అసందర్భమైన సంఘటనలు, సంభాషణలు ఉండవు. అన్నీ హాయిగా, సాఫీగా సాగిపోతాయి.
ఈ రామాయణం మామయ్య నవల పాఠకుల్ని ఆకట్టుకుని చదివిస్తుంది.
- ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, ఇంద్రగంటి జానకీబాల
