-
-
రామాయణం మానవతా వికాసం
raamaayaNam maanavataa vikaasam
Author: Vani Kumari
Publisher: Self Published on Kinige
Pages: 144Language: Telugu
రామాయణం కావ్యంపై అనేక పరిశోధనా వ్యాసాలు వెలువడ్డాయి. చాలా వ్యాసాలు అనుకూలమైనవైతే, కొన్ని ప్రతికూలమైనవీ ఉన్నాయి. ఆ ప్రతికూలమైనవి కూడా పూర్తిగా రామాయణాన్ని కాదనలేవనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. అది ఆ కావ్యానికున్న గొప్పతనం. ఈ మహాకావ్యంలోని అనేక అంశాలను ప్రతిపాదిస్తూ ప్రస్తుతం డా. శ్రీమతి తుమ్మలపల్లి వాణీకుమారిగారు ''రామాయణం-మానవతా వికాసం'' అనే గ్రంథాన్ని ప్రచురించారు.
* * *
వాల్మీకి చిత్రించిన రాముడు మానవుడే అనుకుంటే మరి ఆ మానవుడిలో ఏఏ గుణాలున్నాయి? అవి మన వ్యక్తిత్వ నిర్మాణానికి ఏ విధంగా ఉపయోగపతాయి? అందులోని ఇతర పాత్రలెలా ఉన్నాయి? వాటిలోని మంచి, చెడు గుణాలేమిటి? ఆ చెడును వదలి, మంచినెలా స్వీకరించాలి?ఈ విషయాలు 'వ్యక్తి నిర్మాణం- రామాయణం' అనే అధ్యాయంలో విశ్లేషించటం జరిగింది.
కుటుంబ సభ్యుల మధ్య ఉండవలసిన సంబంధాలు, నిర్వహించవలసిన బాధ్యతలు, వ్యక్తి ప్రవర్తన కుటుంబంపై చూపే ప్రభావం మొదలైన అంశాల అనుశీలన 'కుటుంబ దిశాదర్శనం'గా రూపొందింది. సమాజ వ్యవస్థ పటిష్టంగా ఉండటానికి అనుసరించవలసిన మార్గాలు, ఆచరించవలసిన ధర్మాలు - ఇవి ఆధారంగా ఏర్పడే సామాజిక విలువలు, రామాయణాంశాలతో సమన్వయం 'సమాజ వ్యవస్థ పటిష్టత'గా రూపుదిద్దుకుంది.
దేశం శాంతి, సౌఖ్యాలతో విలసిల్లటానికి రాజు, మంత్రి, పురోహితుడు, సేనాపతి, ఇతర అధికారులు నిర్వహించవలసిన విధులు, వివిధ వృత్తులవారు తమ తమ ధర్మాలను అనుసరించిన తీరు - ఈ అంశాలతో 'వృత్తి ధర్మపాలన' సాగింది. రామాయణంలోని సార్వకాలికమైన, సార్వజనీనమైన అంశాల, మానవీయ విలువల అధ్యయన ఫలితమే 'విశ్వజనీన దిశాదర్శనం.'
వీటన్నిటికీ ముందు వ్యతిరేక దృక్పథంతో చేసిన విమర్శను ఖండిస్తూ, కావ్యప్రయోజనాలనన్నిటినీ రామాయణం కలిగించిన, కలిగిస్తున్న తీరును రేఖామాత్రంగా చెప్పినది 'విహంగ వీక్షణం.' వీటన్నిటి సమాహారమే మానవతా వికాసం.
