-
-
ప్రవహించే పాదాలు
pravahinche padalu
Author: Manthri Krishna Mohan
Publisher: Chandu Prachuranalu
Pages: 105Language: Telugu
వచన కవిత్వం రాయటం అంత సులభమేమీ కాదు. ఎనిమిది దశాబ్దాల వచనకవితా చరిత్రలో మైలురాళ్లూ, మేలిరాళ్ళు అనదగిన కవులు కొందరే వున్నారు. కవికి వస్తుబలంతో పాటు చక్కని శైలి కూడ వుండాలి. శైలి కవి భావవిధానంలో ఒక భాగమైనప్పుడే అతనికి బలమైన అభివ్యక్తి సమకూరుతుంది. సరిగ్గా అటువంటి ప్రయత్నంలో వున్నవాడు మంత్రి కృష్ణమోహన్. గుండెల నిండుగా ఉన్న సంవేదన వల్ల, అలవికాని అశాంతి వల్ల, సానపెట్టుకుంటున్న సాధన వల్ల, అన్నింటినీ మించి లోకంపట్లా, మనిషిపట్లా ఉన్న అపారమైన ప్రేమవల్ల ఇతని కవిత్వం ఆర్ద్రంగా, బలంగా, స్ఫూర్తిదాయకంగా, సురుచిరమౌక్తికంగా రూపొందుతున్నది.
కవితను ప్రారంభించినపుడు వున్న ఉద్వేగస్థాయి చివరిదాకా నిర్వహించగల శక్తి వున్నప్పుడే ఏ కవితైనా పండుతుంది. ఓ కవిత తనకు మాత్రమే అర్థమైతే సరిపోదు. పఠిత గుండెలకు తాకినప్పుడే దానికి సార్థకత. కవిలోని ఆర్తి ఓ భ్రమరంలా లోపల రొద చేయటం దాని ప్రారంభం మాత్రమే, పఠిత హృదయానికి వంతెన వేసి దానిపై పదసైన్యాలతో కవాతు చేయించి ఆవలి ఒడ్డుకు చేరుకొని, అక్కడ తరతరాలుగా నిక్షిప్తమై శబలితంగా వున్న భావాలతో చేయి కలిపినపుడే ఆ కవిత పూర్తయినట్టు లెక్క. మధ్యలోని ప్రక్రియ అంతా బహిరంతరలోకాలతో కవి చేసే సార్జనిక యుద్ధమే. 'ప్రవహించే పాదాలు' దీనికి ఉదాహరణ.
- డా. ఎన్. గోపి
