-
-
ప్రకృతి వరాలు 2
prakruti varaalu 2
Author: Dr. Gayatri Devi
Publisher: Arogyapeetham
Language: Telugu
Description
ఋషి మాసపత్రిక ద్వారానూ, ఈటీవి2 సుఖీభవ ద్వారానూ ఎందరికో ఆరోగ్యాన్ని అందిస్తున్న డాక్టర్ గాయత్రీదేవి రచించిన ఆయుర్వేద ఆరోగ్య గ్రంథం.
ఆయుర్వేదానికి సంబంధించిన చరిత్ర, మూల సిద్దాంతాలు, మూలికల నుండి శాస్త్రీయంగా మందులు తయారు చేసుకొనే విధానం, అనుపానాలు, పథ్యాల గురించి కలిగే సందేహాలకి సమాధానాలు తేలికగా అర్థం అయ్యేలాగా అందిస్తుంది.
రోజూ తినే ఆహారపు వివరాలు, ఫలాల అవసరాలు, ఆరోగ్య సమస్యలకి పరిష్కారాలు చూపిస్తుంది. డాక్టర్ల దగ్గరికి పరిగెత్తే అవసరాన్ని తగ్గిస్తుంది. ఆత్మీయంగా మీతో మాట్లాడుతుంది.
మీ సందేహాలు వింటుంది. సమాధానాలు చెబుతుంది. ప్రతిరోజూ ఒక్క అంశం గురించి చదవండి. చదివి జీర్ణించుకుని మీ సమస్యలని మీరే పరిష్కరించుకోండి.
రచయిత్రి పరిచయం
- ఆయుర్వేద వైద్యంలో రెండు దశాబ్దాల అనుభవం.
- పత్రికలు, రేడియో, టి.వి. మాధ్యమాల ద్వారా అందరికీ ఆయుర్వేదం ద్వారా ఆరోగ్యాన్ని అందించే ప్రయత్నం.
- తండ్రి శ్రీ ఉషశ్రీ అసంపూర్ణ గ్రంథం "రామాయణంలో హనుమంతుడు" సంపూర్తి.
- 'ప్రకృతి వరాలు' పుస్తక రచన.
- ఆయుర్వేద విద్యార్థుల కోసం "Padartha Vijnana Made Easy", "Prasuti Tantra Made Easy", "Stree Roga Made Easy" పాఠ్య గ్రంథ రచన.
- "Why of Herbs", "An Institute of Ayurveda", "పుట్టబోయే బుజ్జాయి కోసం" రచనలకి జాతీయ బహుమతులు.
- ఇండియాటుడే, ఆంధ్రప్రభ, స్వాతి, రచన పత్రికలలో కథల ప్రచురణ బహుమతులు.
- కాశవాణి వివిధ కేంద్రాల ద్వారా నాటికల (రచన) ప్రసారం.
- రతముని ఆర్ట్స్ అకాడమీ వారి - "ఆదర్శ వనితా పురస్కారం" - 2007
- చిత్రలేఖనం దినచర్యలో భాగం
Preview download free pdf of this Telugu book is available at prakruti varaalu 2
Login to add a comment
Subscribe to latest comments
