• pPettubadidari Arthika Samkshobhamlo Kutumba Patanaalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పెట్టుబడీదారీ ఆర్ధిక సంక్షోభంలో కుటుంబ పతనాలు

    pPettubadidari Arthika Samkshobhamlo Kutumba Patanaalu

    Pages: 99
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకం శ్రీ ఆవంత్స సోమసుందర్ 1. పణవిపణి (1956) 2. సినీవాలి (1963) అనే రెండు కావ్యాలపై చేసిన విశ్లేషణ.

* * *

పణవిపణి అనే విశిష్టకావ్యాన్ని 1957లో కాకినాడ నుండి ప్రచురించాడు శ్రీ నళినీకుమార్‌! పణవిపణి ఆద్యంతం ముత్యాలసరాలుతో సాగిన కవితలు ఆధునిక ఆంగ్ల సాహిత్య శ్రేణిలోనే విశిష్టతతో తులతూగింది! ఈ కావ్యం ప్రధానంగా ఫ్యూడల్‌ వ్యవస్థ గడచిపోయి, పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థ పెంపొందుతున్న నాటి దశలో రచించ బడింది. మొత్తానికి పెట్టుబడిదారీ ఆర్ధిక సంక్షోభం మానవజాతి కుటుంబాలలో మమతానుబంధాలను, వావివరుసలను ప్రశాంత గత జీవితాలను ఛిద్రం చేస్తుంది. అమానుషమైన విలువలను మానవజాతికి అందిస్తుంది. ఈ కావ్యంలో నాయకుడు, ప్రశాంత గృహవాతావరణములో పుట్టి, పెరిగి ఆ శాంతిమయ జీవితానికే దూరంగా తరమబడతాడు. పరిసరాలు కోల్పోయాక, దిక్కుతోచదు. చాలా హృద్యంగా చిత్రించాడు. కవి నిర్లిప్తంగా, బాహ్య పరిస్థితులను వ్యక్తం చేయడానికి అనువుగా ఛందస్సు కూడ నిర్లిప్తంగానే సాగుతుంది.

స్వాతంత్య్రం పొంది, మనదేశానికి దశాబ్ద కాలంలో ఈ కావ్యం రచించబడింది. పెట్టుబడిదారీ సంక్షోభాలన్నీ మన దేశంలో వ్యక్తి జీవితాన్ని చిందరవందర చేశాయి. అందువల్లనే సమకాలీన, సమాజ వాస్తవ పరిస్థితులను చిత్రించిన కావ్యంగా దీనికి ప్రధమ గణ్యత లభిస్తుంది.... ఆధునిక కవితలలో మొట్టమొదటిసారిగా పణవిపణితోనే కథాకావ్యం కూడా మొదలయింది. సరిగ్గా ఈ దశలోనే రచింపబడి పెట్టుబడిదారీ సంక్షోభం ఛిద్రం చేస్తున్న వైఖరులనూ, సంఘటనలనూ స్పష్టం చేస్తున్న మరొక కావ్యం సినీవాలి!

త్వమేవాహం తర్వాత ఆరుద్ర రచించిన ప్రయోగాత్మక కావ్యం సినీవాలి మాత్రమే. సినీవాలి మధ్యతరగతి క్లేశాల చిత్రణలో సాగిన సంపూర్ణ కావ్యం. త్వమేవాహం కేవలం సంవిధానం కోసం చేసిన అగమ్యపథంగా పేర్కొనబడింది. కాని ఈ కావ్య ప్రసాద గుణ సంవృద్ధితో కావ్యగత విషయానికో, వర్ణనీయ వస్తువుకు ప్రాధాన్యతనిస్తూ సాగింది. ఇందులోను నాటకీయత లేకపోలేదు. భిన్న భిన్న పాత్రలు ప్రవేశిస్తాయి. స్వగతాలు వంటి భాషణలు చేస్తూనే ఉంటాయి. ఇది సార్ధక జీవనానికి సంకేతం. మానవత్వానికి సచేతన, కేతనం మంచితనానికి మెదడున్న నికేతనం!

- ఆవంత్స సోమసుందర్

Preview download free pdf of this Telugu book is available at pPettubadidari Arthika Samkshobhamlo Kutumba Patanaalu