-
-
ఊడలమఱ్ఱి
oodalamarri
Author: MS.Telangi
Publisher: Self Published on Kinige
Pages: 170Language: Telugu
Description
వర్గ దోపిడికి వ్యతిరేకంగా, సమ సమాజ నిర్మాణానికి చిత్తశుద్ధితో, ఉద్యమ నిబద్ధతతో నక్సలైట్ల పురోగమనం ఈ నవలకు ఇతివృత్తం. నవల అనగానే దానిలో ఒక హీరో, హీరోయిన్, విలన్ పాత్రలుంటాయని, వాళ్ళతోనే కథ, సంఘటనలు ముడివడి వుంటాయని తెలుగు పాఠక జనం ఊహించే అవకాశం వుంది. కాని ఈ నవల దానికి మినహాయింపు. ప్రజాస్వామ్య సంప్రదాయాలను సాహిత్యం ప్రతిబింబించాలనే ఆలోచనతో పాత్రల చిత్రణలో సమతుల్యం పాటించాడు రచయిత.
‘ఊడలమఱ్ఱి’ ఈ వ్యవస్థకు సంకేతం. దీన్ని కూకటివేళ్ళతో పెకలించాలంటే ఏ ఒకరిద్దరివల్లనో అయ్యే పని కాదు. ఎన్నో కష్టాలకు, వ్యయ ప్రయాసలకు గురి కావల్సివుంటుంది. ఆత్మబలిదానాలు, రక్తతర్పణాలు అనివార్యం అవుతాయి. ఏది ఏమైనా ఇది ‘ఉన్నవాడికి లేనివాడికి మధ్య జరిగే అనంత సంగ్రామం’, ‘పరస్పరం సంఘర్షించిన శక్తుల’లోనే చరిత్ర ప్రగతి ఆధారపడి వుంది.
Preview download free pdf of this Telugu book is available at oodalamarri
ఊడలమఱ్ఱి నవల ఈ మధ్యే చదివాను. నేను ఈ మధ్య చదివిన పుస్తకాలలో ఇది చాల మంచి పుస్తకము అని నాకు అనిపించింది, ఇందులో చెప్పిన ప్రతి అంశం కూడా చాల బాగుంది. నవలలు అంటే ఇష్ట పడేవారు తప్పక చదవలసిన నవల ఇది.