-
-
నిత్య గాయాల నది
nitya gayala nadi
Author: Bejjarapu Ravinder
Publisher: Palapitta Books
Pages: 110Language: Telugu
దాస్ కాపిటల్‌ను చదవడం ప్రారంభించాను. అందులోని పదాలు, వాక్యాలు అర్థమవుతున్నకొద్దీ, అక్షరాలు నేలజారడం ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి తర్వాత అవి మనుషులుగా మొలకెత్తడం గమనించాను. క్రమంగాఅ ఎదిగి... ఎదిగిన మనుషులు, సమూహాలు, సమూహాలుగా గది తలుపులు తెరుచుకొని జనంలో కలవడం మొదలుపెట్టారు. భయంవేసి పుస్తకం చదవడం ఆపాను.
కాని ఆమెలో ఉన్నటువంటి ఆకర్షణే ఆ పుస్తకంలోనూ ఉంది. ఆమెలోని మార్మికతే పుస్తకంలోనూ ఉంది. పుస్తకాన్ని వాపసు చేద్దామని ఆమె కోసం వెతికాను, కనిపించలేదు. ఆమె కనిపించకుండా ఉన్న కొద్దీ నాలో ఆరాటం ఎక్కువయింది. పుస్తకాన్ని చేతిలో పట్టుకొని తిరిగే ప్రతీసారి, ఒక గొప్ప జనసమూహాన్ని వెంటేసుకొని తిరుగుతున్నట్లుగా ఊపిరాడేది కాదు. ఎట్టకేలకు ఒకరోజు కనిపించింది. పరిగెత్తుతూ ఆమె దగ్గరికి వెళ్లాను. పుస్తకాన్ని ఆమె చేతిలో పెట్టాను. ఒకసారి ఆప్యాయంగా దాన్ని నిమిరి తెరచి చూసింది. పట్టరాని సంతోషం ఆమె కళ్ళలో కనిపించింది.
- (నిత్య గాయాల నది)
