-
-
నేను తిరిగిన దారులు
nEnu tirigina daarulu
Author: Vadrevu China Veera Bhadrudu
Pages: 208Language: Telugu
తెలుగులో యాత్రాచరిత్రలు కొత్తకాదు. ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రా చరిత్ర నుండి ఆదినారాయణ భ్రమణకాంక్ష దాకా రాహుల్ సాంకృత్యాయన్ లోకసంచారి నుంచి బి.వి.రమణ ట్రెక్కింగ్ అనుభవాలదాకా తెలుగు సాహిత్యప్రపంచాన్ని సుసంపన్నం చేసిన యాత్రాచరిత్రలెన్నో ఉన్నాయి. ఆ కోవలోనే వాడ్రేవు చినవీరభద్రుడు రాస్తూ వచ్చిన యాత్రారచనల సంకలనం ఇది.
ఇందులో 1997లో ఇంగ్లాండ్ సందర్శించినపుడు రాసిన యాత్రానుభవాలతో పాటు ఇండియాటుడే తెలుగుపత్రిక కోసం అరకులోయ, నల్లమల దారులు, పాపికొండల నడుమ సంచరించిన యాత్రాకథనాలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మిక స్థలాలైన అరుణాచలం, బృందావనం, త్రయంబకంలతో పాటు, జైన, బౌద్ధ క్షేత్రాలయిన శ్రావణ బెళగొళ, సాంచిల సందర్శనానుభవాలూ, ఆదిమానవుడి గుహచిత్రాలతో పాటు అద్భుతమైన శిల్పరామణీయకత వెల్లివిరిసే హళెబీడు, బేలూరుల దాకా ఎన్నో చారిత్రకస్థలాల పర్యటన వివరాలు ఇందులో ఉన్నాయి. ఢిల్లీ నుంచి రాసిన ఉత్తరాలు ఈ సంపుటికొక ప్రత్యేక ఆకర్షణ.

- FREE
- FREE
- FREE
- FREE
- ₹75
- FREE