-
-
నేనెరిగిన నాన్నగారు
nEnerigina naannagaaru
Author: Dr. Shyamala Ghantasala
Publisher: Ghantasala Publications
Pages: 250Language: Telugu
"Shyamala is the poetic contribution of Sri Ghantasala's Music Genius and Artistic Prowerss" అని అనిపించకమానదు ఈ పుస్తకం పాఠక లోకానికి. పదాల పొందిక, భావాల పొంతనం, స్పష్ట వివరణ అలా అలా ఎన్నెన్నో వైశిష్ట్యా లీమె రచనలో గల ప్రత్యేకతలు.
- పి. బి. శ్రీనివాస్
* * *
"నీకై నువ్వు నిజాయితీ కలిగి వుండు, నిన్ను నువ్వు గౌరవించుకో, ఆత్మవిమర్శని విస్మరించకు. ఇదే విధమైన ఉదారవైఖరి, దృక్పథం నీ చుట్టూ ఉన్నవారి పట్ల చూపించు. నాగరక ప్రవర్తన అంటే ఇదే" నంటూ జీవిత పాఠాలని చిన్నతనంలోనే బోధించిన గురువు, జీవిత మార్గదర్శి నాన్నగారు.
తన జీవితాన్ని గురించి కొందరైనా యిష్టంగా చదవాలని ఆశపడ్డారు. ఆయన మరణించే నాటికి నా వయసు కేవలం పదునాలుగు సంవత్సరాలు. వయసుతో పాటు ఆలోచన, అనుభవం పెరిగేకొద్దీ వ్యక్తిగా నాన్నగారి గొప్పదనం, ఉన్నతమైన వ్యక్తిత్వం అర్థమై, ఆయన జీవిత చరిత్రని అసంఖ్యాకమైన వారి అభిమానులకు అందించాలన్న కోరిక బలంగా మనసులో నాటుకుంది
ఇంత కాలానికి నా కలతో పాటు నాన్నగారి ఆశకు అక్షర రూపం కల్పించగల అవకాశం లభించింది. జన్మ కారకులైన నా తండ్రికి భక్తితో, కృతజ్ఞతతో, ప్రేమతో సమర్పిస్తున్న అక్షర నివాళి "నేనెరిగిన నాన్నగారు"
- డా. శ్యామల ఘంటసాల
* * *
గమనిక:
ఇది డా. శ్యామల గారు తన చేతి రాతతో రాసిన పుస్తకం. చేతిరాతని స్కాన్ చేసి పుస్తకంగా డిజైన్ చేసారు. కాబట్టి ఈపుస్తకం లుక్ అండ్ ఫీల్ మిగతా కినిగె ఈ-పుస్తకాలకు భిన్నంగా ఉంటుంది, గమనించగలరు.
Book is good. But i don't understand the logic in releasing the book in manuscript form. Those who know the author personally could appreciate the effort,but for 'fans' of 'Ghantasala' a print edition with more photos would have been more interesting.
I appreciate her for writing the book on her father . I am an ardent fan of the great singer ,The narration is open, straight and heart touching.
It pained me ,when i know that NTR, ANR did not attend the last rites .
Thanks Kinige