-
-
మయమతము వచనము
mayamatamu vachanamu
Author: M. Viswanatha Raju
Publisher: Sri Sai Vastu Publications
Pages: 144Language: Telugu
మయమతము - వచనము
మూలం: మయ బ్రహ్మ
తెలుగు: డా. ముదుండి విశ్వనాథరాజు
వాస్తుశాస్త్ర గ్రంథములలో మయమతము ప్రముఖస్థానమును పొందినది. దీని ప్రాధాన్యత నెరుగని వాస్తు పండితులుండరు. సంప్రదాయ వాస్తు విషయములెన్నో ఈ గ్రంథములో తెలియజేయబడినవి. గృహవాస్తు విషయములతో పాటు దేవాలయ శిల్పమునకు సంబంధించిన అనేక విషయాలు మయబ్రహ్మ తన గ్రంథములో తెలియజేసెను.
వాస్తులో ప్రథానమైన భూమి, ప్రాసాద, శయన, యానములనెడి నాలుగు ప్రధాన విషయముల నతివివరముగా మయబ్రహ్మ తన గ్రంథములో వివరించెను. దీనిలో గృహస్థుల కుపయోగపడు గృహవాస్తు విషయాలను మాత్రమే అనువదించుట జరిగినది. ఈ గ్రంథములో చతుర్విద వాస్తువులకు సంబంధించిన అనేక మర్మ విషయములు వివరముగా తెలుపబడినవి.
వాస్తుశాస్త్రాభిలాషులైన తెలుగు పాఠకులు, వాస్తు విద్యార్థులు ఈ గ్రంథమును చదివి సంప్రదాయ వాస్తుశాస్త్రజ్ఞానమును పొందగలరని యాశించుచున్నాను. ఈ గ్రంథాయధ్యయనము వలన ఏ కొంత ప్రయోజనము పొందినను నాకృషి సఫలమైనదని భావింతును.
- భవదీయుడు
డా. ఎం. విశ్వనాథరాజు
