-
-
మట్టి పలకలు
matti palakalu
Author: Manthri Krishna Mohan
Publisher: Malleteega
Pages: 135Language: Telugu
Description
మంత్రి కృష్ణమోహన్ 365 నానీలతో మీ ముందుకు వస్తున్నాడు. కవికి మౌలికంగా ఉండవలసిన మానవీయ సంవేదన, ఆర్తి మంత్రి నానీల్లో ఉన్నాయి. సకల మానవాళికి అక్షరాలు దిద్దించిన పలకల ఊరు మార్కాపురం నుండి వచ్చాడు మంత్రి. నానీల్లో తన 'మార్కు' తనదే. మంత్రి లాంటి వాళ్ళు తమ కవితా శక్తితో నన్ను మించి పోవాలని నా కోరిక.
ఎవరికీ పూర్తిగా అర్థంగాని ఒక మార్మికశక్తి జీవితాన్ని నడిపిస్తుందని ఇలాంటి వాటివల్ల నాకు అనిపిస్తూ వుంటుంది. మంత్రిలాంటి ఆత్మీయుణ్ణి ప్రసాదించినందుకు నానీలకు నా కృతజ్ఞతలు.
- డా. ఎన్. గోపి
'మట్టి పలక'
అని చులకనా!
అక్షర దీప్తికి
తొలి ప్రమిద కదా.
వెలుగెవరు పంచినా
స్వాగతమే.
బుజ్జోడు దీపం పెడితే ఆర్పేస్తామా?
'రూపాయి' అని
భ్రమపడిందేమో
భూమి సూర్యుడి చుట్టూ
తిరుగుతోంది.
Preview download free pdf of this Telugu book is available at matti palakalu
Login to add a comment
Subscribe to latest comments
