• manishi kOsaM
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మనిషి కోసం

    manishi kOsaM

    Pages: 75
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అప్పుడు నాకేం తెలుసు
నేను కడుతున్న సౌధాల
పునాదులు విచ్చిపోతాయని?
ఇప్పుడు తెలుస్తోంది నాకు
పునాదులే కాదు గోడలు గూడ బీటలు వారినయ్యని !

రెండు దశాబ్దాల దీర్ఘకాలంలో
యెన్నో మార్పులు - మరెన్నో చేర్పులు....
వాక్కుకి దూరమయినా
వట్టి కడుపుతో వుండలేదానాడు
బానిస జీవితం గడిపినా
బ్రతుకు భారం కాలేదానాడు -
ఈనాడు... వసపిట్టలా వాగొచ్చు గాని వట్టి కడుపుతోనే ఉండాలి,
స్వతంత్రులం మేమని విర్రవీగుతూ
బ్రతుకు భారంగా గడపాలి.....
చూసేందుకు ఏమున్నది నా చుట్టూ
దుర్భర దారిద్ర్యమూ - దుర్భిక్ష క్షామమూ తప్ప!
వినేందుకేమున్నా యిక్కడ
ఆకలి కేకలు - అరణ్య రోదనలు తప్ప!

స్వార్థపరుల సమాజ స్థాపన విచ్ఛేదం
రాజకీయాల రక్కసి శిరచ్ఛేదం
ఏనాడో... ఆనాడే
ఇహం పొలిమేరల్లో పరం తొలి దారుల్లో
పరుగులు తీస్తున్న నాకు తిరోగమనం
ఈ భారతావని పురోగమనం.

Preview download free pdf of this Telugu book is available at manishi kOsaM