-
-
మహస్సు
mahassu
Author: Darshanam
Publisher: Marumamula Rukmini
Pages: 152Language: Telugu
శ్రీ విశ్వజననీ పరిషత్, జిల్లెళ్ళమూడిలో నవంబర్ 2011లో నిర్వహించిన "అమ్మతత్త్వచింతన మహా సదస్సు" ప్రసంగాల సంకలనం ఈ "మహస్సు".
* * *
"బ్రహ్మసూత్రములు ఎంతటి తత్త్వసంపన్నమైనవో, భావనాగర్భితమైనవో అమ్మమాటలు అంతే తత్త్వసంపన్నమైనవి, భావగర్భితమైనవి. తెలుగులో సూత్రీకరణ ప్రక్రియ లేదు. అది ప్రారంభించిన కీర్తి అమ్మకే దక్కుతుంది. ఎన్ని సూత్రాలను అమ్మ అందించిందో లెక్కేలేదు. బ్రహ్మసూత్రాలకు అమ్మసూక్తులు ఎంత మాత్రం తీసిపోవు. తరచి చూసినకొలది మరింత నిగూఢ భావాలు వ్యక్తమౌతుంటాయి. అమ్మ మాటలలోని అర్థాన్ని గురించి ఎంత మాట్లాడుకున్నప్పటికీ ఇంకా కొంత మిగిలేవుంటుంది. అందుకే తత్త్వచింతన సదస్సులో మాట్లాడుకున్న విశేషాలు గ్రంథస్తం కావలసిన అవసరం ఉన్నది. 'దర్శనమ్' ప్రత్యేక సంచిక అలాంటి అవసరాన్ని తీరుస్తున్నది."
- పొత్తూరి వెంకటేశ్వరరావు
"అమ్మతత్త్వం- అమృతతత్త్వం. హైందవ ధార్మిక జీవితానికి అమ్మే మూలపుటమ్మ. దైవం మానుషరూపేణ అన్నారు పెద్దలు. భగవంతుడు ప్రతీచోటా ఉండలేక అమ్మ రూపంలో అవతరించి మానవాళిని కనికరించాడని మనందరి నమ్మకం. ఆ భావంతోనే మనం మన మాతృమూర్తులను దర్శించుట అత్యంత ఆవశ్యకము. మరి అమ్మలకే అమ్మ అయిన ఈ అమ్మను ఏ విధముగా మనము కొలవాలో తెలుసుకొనుట చాలా ప్రధానము. ఈ ప్రత్యేక సంచికలో ఎందరో మహాత్ములు తమ అపూర్వ సందేశాల్ని అక్షర రూపంలో అందించారు. ఆ ఆలోచనా అమృతాన్ని మనం అందుకోగలిగితే, అమృతత్త్వాన్ని సాధించినట్లే. ఈ ప్రత్యేక సంచికలోని ప్రతి వ్యాసం అమూల్యం. ప్రతి ఒక్కరూ ఈ ఆలోచనామృతపు అమ్మతనాన్ని అందుకోవాలని, అందుకుంటారని ఆశిస్తూ....."
- ఎల్. వి. సుబ్రహ్మణ్యం
గమనిక: "మహస్సు" ఈ-బుక్ సైజు 6.20 MB
