-
-
మా నాయన బాలయ్య
maa naayana balaiah
Author: Y. B. Satyanarayana
Publisher: Hyderabad Book Trust
Pages: 184Language: Telugu
మా నాయన బాలయ్య
ఆంగ్లమూలం: వై. బి. సత్యనారాయణ
అనువాదం: పి. సత్యవతి
స్వాతంత్ర్యానికి ముందూ, ఆ తరువాతా ఈ దేశంలో ఒక దళితుని మనుగడ ఎట్లా వుందో చాలా శక్తివంతంగా పదునుగా చెప్పిన పుస్తకం ఇది.
- ది హిందూ (మార్చ్ 3, 2012)
ఈ కథ ఒక విజయ పరంపర. అయితే ఈ ప్రయాణం ఇంకా కొనసాగవలసి వున్నది. "మా నాయన బాలయ్య" బహుశా సొరంగంలో ప్రయాణం చేసిన తర్వాత ప్రత్యక్షమైన వెలుగు అనుకోవచ్చు.
- డెక్కన్ హెరాల్డ్ (ఫిబ్రవరి 19, 2012)
అలెక్స్ హేలీ 'ఏడుతరాలు' రాసి ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపాడు. ఆ పుస్తకం నల్లవాళ్ల బైబిల్‌గా ప్రసిద్ధికెక్కింది. ఇప్పుడు వై.బి.సత్యనారాయణ మూడు తరాల ఆత్మకథ రచించి చరిత్ర సృష్టించాడు. సాహిత్యంలో మరాఠీ ఆత్మకథ విజయకేతనం ఎగురవేస్తే ఇప్పుడు తెలుగులో తొలిజెండా ఎగురవేసిన ఈ పుస్తకం సాహిత్య చరిత్రలో ఓ మైలురాయి. మాదిగల చరిత్రను అక్షరీకరిస్తే అది రామాయణ, మహాభారతాలను మించిపోతుంది. ఇది ఒక బాలయ్య ఆత్మకథ మాత్రమే కాదు, లక్షలాది బాలయ్యల భార చరిత. రచయిత తన అపూర్వ మేధతో, పరిశీలనతో, రచనా శిల్పంతో ఈ పుస్తకాన్ని అమూల్యం చేశాడు. ఈ పుస్తకం చిదివితే మాట తప్పని మానధనులైన మాదిగల మహోన్నత మనస్తత్వం, స్వేచ్ఛ, వారి అమాయకత్వం పరోపకారప్రియత్వం, బహుభాషా పరిజ్ఞానం, సౌందర్యాత్మక దృష్టి మరియు చెప్పుల నిర్మాణంలో గొప్ప కళాసృష్టి పాఠకుల దృష్టిని ప్రగాఢంగా ఆకర్షిస్తాయి.
- ఎండ్లూరి సుధాకర్
దళిత జీవితచరిత్రలలో ఓ మైలురాయి వంటిదీ పుస్తకం. ఈ జీవితకథలో అప్పటి రైలు మార్గాల నిర్మాణం వలెనే బాలయ్య కూడా అంతే వేగంగా మూడు తరాలను ఆధునికతలోకి ప్రయాణం చేయించాడు. ఆధునికతని పోరాట సాధనంగా చేసుకున్నాడు.
- గోపాల్ గురు
తెలంగాణా గ్రామీణ జీవితాల్లో పొరలు పొరలుగా ఎదురయ్యే పేదరికం, సామాజిక వెలి, అంటరానితనం, శ్రమ దోపిడీ, కష్టాల కడగండ్ల వంటి వాటన్నింటిపై ఓ దళిత కుటుంబం సాగించిన యుద్ధాన్ని కళ్లకు కట్టే రచన ఇది. వాళ్లీ క్రమంలో చేసిన ప్రయత్నాలనూ, అనుభవించిన వేదననూ నిజాయితీగా ఆవిష్కరిస్తుందిది. విద్యకోసం, ఆత్మగౌరవం కోసం, స్వేచ్ఛకోసం జరిపే పోరాటంలో విజయం ఎంత ప్రధానమో బలంగా నొక్కి చెప్పే ఈ రచన - మనల్ని కల్లోల పరుస్తుంది. అదే సమయంలో ఎంతో స్ఫూర్తినీ రగిలిస్తుంది.
- శాంతా సిన్హా
వై.బి. సత్యనారాయణతో ఈ పుస్తకం గురించి కినిగె పత్రిక ఇంటర్వ్యూ:—
http://patrika.kinige.com/?p=2108
I need this book how to find it sir please help me
నిజంగా ఈ కథ అణచివేతకు, దోపిడీకి, అవమానాలకు వ్యతిరేకంగా ఒక యోధుడు చేసిన పోరాట విజయ పరంపర. ఆ యోధుడు బాలయ్య. కష్టపడి పని చేయడం, చెడు అలవాట్లను వదిలిoచుకోవడం, ఆధిపత్యాన్ని ధిక్కరించడం, ఉన్నతమైన ఆలోచనలు చేయడం, పిల్లల భవిష్యత్తు కోసం తపన పడటం, అనేవి అతని ఆయుధాలు, ఈ పోరాటం లో భార్య పిల్లలు కూడా తోడయ్యారు. కాని అవసాన దశలో ఆ దంపతులు నిస్సహాయులవడం దురదృష్టకరం.
కథలో తెలంగాణ సామజిక పరిస్థితులు, రజాకార్ల, దొరల దురాగతాలూ, మూఢ నమ్మకాలూ, ఆస్పృష్యత యొక్క వికృత రూపం, ఉమ్మడి కుటుంబాల అనురాగాలు, సాదక బాధకాలు, కింది స్థాయి రైల్వే ఉద్యోగ జీవితాలు చాలా బాగా వివరించారు. కాని కొన్ని చోట్ల ఉదా,, కి, చిన్న నర్సయ్య తండ్రి చనిపోయిన తర్వాత ఊరి జనాలకు అకస్మాత్తుగా దూరం అవడం, గార్డుల భార్యలు ఒకచోట ఇష్టపడతారు అని ఇంకో చోట ఇంట్లోకి రానియారు అని అంటరానివారిగా చూస్తారని ఉండడం, కల్లు తాగే అలవాటును ఏమాత్రం ఎక్కడ కూడా విమర్షించకపోవడం తర్కబద్ధం అనిపించలేదు.
కథనం లో ఎక్కడ కూడా అస్పృష్యులను హిందువులలో కలపకపోవడం దురదృష్టకరం, నా దృష్టిలో సమాజంలో అగ్ర లేదా ఉన్నత కులాలు, చిన్న లేదా తక్కువ కులాలు ఉన్నాయి కాని హిందువులు వేరుగా తక్కువ కులాలు వేరుగా లేవు. పుట్టిన ప్రతి వాడు మనుధర్మమో వేరే ఇంకో ధర్మమో పాటించవలసినదేనా, బాలయ్య లాగా స్వధర్మం పాటించలేడా, రామాయణ భాగవతాలను చదవొద్దన్న అజ్ఞానులను ఎదిరించలేడా?
రచయిత గారి ఆత్మకథ కూడా ఇందులో బాగా మిళితమైపోయింది, టికెట్ లేకుండా ప్రయాణించడం కూడా ఎంతో నిజాయితీ గా రాశారు, ఒక human excellence కి ఉదాహరణే బాలయ్య, ఆయన జీవితమే ఒక మూర్తిమత్వ వికాస పుస్తకం, ఆ పుస్తకాన్ని అందించిన సత్యనారాయణ సార్ గారికి ధన్యవాదాలు.