• kulAmkalI
 • Ebook Hide Help
  ₹ 30 for 30 days
  ₹ 97.2
  108
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • కులాంకలీ

  kulAmkalI

  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description
రచయిత స్వంత మాటల్లో

నేను చెప్పాలనుకుంటున్నది...

నాగరికులు నన్ను ఊరోడన్నారు! నాకు చాలా నచ్చింది. వూరోడనిపించుకోవడం ఇప్పటికీ నాకిష్టమే. ఊరోడికి, స్వచ్ఛమైన, అమాయకత్వం, మొండితనం, అవసరమున్నచోట మొరటుతనం ఉంటాయి. మొరటు చేతులు, మాటలూ ఉంటాయి. మూడు, నాలుగు దశాబ్దాల కాంగ్రేస్ పాలనను తుదముట్టించింది ఈ "ఊరోళ్లే". తొమ్మిదేళ్ల తెలుగుదేశం పాలనను మట్టి కురిపించింది ఈ "ఊరోళ్లే". ఆ మొండితనమే జీవితానికి దగ్గరగా ఉండేది.

నేను ఉస్మానియా మెడికల్ కాలేజీలో మెడిసిన్ మూడో సంవత్సరం చదువుతున్నప్పుడు నా క్లాస్‌మేట్ యం.ఏ.రెడ్డి నన్ను నా ఇంకో క్లాస్‌మేట్ పాపయ్యతో పోల్చి, పాపయ్య అమాయకుడు, నువ్వు చాలా చాలుగాడివి. నీతో డేంజరే ఉంది అన్నాడు. అదీ నచ్చింది నాకు.

..... మా వూళ్లో నేను 10వ తరగతిలో ఉండగా, రాత్రి 8 గంటలప్పుడు 30, 35 సంవత్సరాలవయస్సున్న భర్త పట్టించుకోని ఒక క్రిష్టియన్ మహిళ; సారా అమ్ముతూ బతుకుతున్నందుకు ఆమెను (చిట్టెమ్మ) రోమన్ క్యాథలిక్ అయిన, రెడ్డికులపు ఫాదర్ చర్చిలో తన బెల్టుతో నిర్ధాక్షణ్యంగా కొడుతున్నప్పుడు, "మీరు ఆమెను ఎందుకు కొడుతున్నారు?" అన్నందుకు, "ఏందిరో నువ్వు నన్నే అడిగేటంతడి వాడివయ్యావా?" అన్నాడు. ఆమెను కొట్టడం తప్పు అన్నాను. అందుకు ప్రతిఫలంగా, నాకు యివ్వవలసిన సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదు ఆయన. అప్పుడూ ఫీలవలేదు. ఆంధ్ర లయోలా కాలేజీలో (రోమన్ క్యాథలిక్ కాలేజీ) క్రిస్టియానిటిలో కులాలున్నాయన్న విషయం తెలుసుకున్నాక, జెస్యూట్ సొసైటీ ఫాదర్స్‌లో చేరవలసిన వాణ్ణి, రూట్ మార్చుకున్నాను. అప్పుడూ బాధ పడ్లేదు.

....1973లో అంబర్‌పేట ఎస్.సి హాస్టల్‌లో ఒకే రాత్రి డా|| అంబెడ్కర్ రాసిన 'కుల నిర్మూలన' గ్రంథం చదివిన తరువాత చిన్నప్పుడు మా పెద్దయ్య కొడుకు ధామస్ అంబెద్కర్ క్రిస్టియన్ల్‌కి వ్యతిరేకమని చెప్పిన మాట అబద్దమని తేలింది. అంబేద్కర్ గురించి ప్రచారమయిన అబద్దాల్లో ఇది ఒకటి మాత్రమే. గోబెల్స్‌కి తల్లిలాంటి హిందూ సమాజంలో బి.ఆర్. అంబెద్కర్ పట్ల ఇంత కన్నా ఎక్కువ ఉదార భావం ఆశించలేము కదా!

.... లయోలా కాలేజీ, ఉస్మానియా మెడికల్ కాలేజీ, శ్రీ చిత్ర తిరునాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, త్రివేంద్రం... ఖమ్మం... ప్రాంతాలు వేరు; కాని అన్ని చోట్ల హిందూ సామ్రాజ్య వాద పద ఘట్టనలు; హైందవ నాగరాజు కస్సుబుస్సులే. క్రిస్టియన్స్‌తో, కమ్యునిస్టులతో...... తరచి చూస్తే, లోలోతుల్లోకి వెళ్తే అన్నీ అగ్రహారాలే. ఎన్నో శంకరమఠాలు; కాకపోతే ఈ అగ్రహారాల, శంకరమఠాల పోషకులు, పాలకులు మారారు. నేను ఈ పుస్తకంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు కేవలం గాయపడ్డ గాయాల చిహ్నాలే. అసలు జబ్బును నిర్థారించవలసిన అవసరం ఉన్నది. ఈ పుస్తకంలోని వ్యాసాల్లో బలప్రయోగమే కులాల ఆవిర్భావానికి కొనసాగింపుకు కారణం అన్న వ్యాసం నాకే సంతృప్తి కల్గించలేదు. ఈ సిద్ధాంత వ్యాసాన్ని యింకా మెరుగుపర్చవలసి ఉన్నదని సవినయంగా మనవి చేస్తున్నాను. ఎప్పుడో, ఏ విధంగానో ఖచ్చితమైన ఆధారాలు చూపే వీలులేని 'కులవ్యవస్థ' ఆవిర్భావాన్ని గురించి పరిశోధించినా, ఆ పరిశోధనలకు, ఆ అంశాలు మరీ పురాతనమైనప్పుడు ఆయా అంశాల తూలూకు, పురావస్తు సంబంధితం కాక సాహిత్యపరమైనటు వంటివి అయినప్పుడు ఆ సాహిత్యం ప్రధానంగా విజేతల ఆధీనమైనప్పుడు, ఆయా సాహిత్యాల్లో, ఇతిహాస గ్రంథాల్లోని వాస్తవాలను రాబట్టడానికి, "నెగెటివ్" పాత్రల కోణం నుండి చూడాలి. అట్లా చూడటమే కాదు, సంభవమయ్యే సంఘటనలను నిశితంగా పరిశీలించాలి.

Preview download free pdf of this Telugu book is available at kulAmkalI