-
-
కొమురం భీము
komuraM bheemu
Author: Sahu and Allam Rajaiah
Publisher: Perspectives
Pages: 276Language: Telugu
ప్రపంచ చరిత్రలో మొదటి నుంచి ఇప్పటిదాక శత్రువుతో సాయుధపోరాటం చేసిన, చేస్తున్న చరిత్ర ఆదివాసులది మాత్రమే. వాళ్ల జీవితాల్లో మార్కెట్టు లేదు. వ్యక్తిగత ఆస్తిభావన లేదు. మన కాలంలో మన కళ్ల ముందు కొమురం భీము ఆకారం చూస్తూ ఉండగానే ఆకాశమంత ఎత్తుకెదుగుతున్నది. ఏకకాలంలో విప్లవోద్యమానికి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి, ఆదివాసీపోరాటాలకి ప్రేరణ కాగలిగిన వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేస్తున్నది. భీము అడవి కడుపున విత్తనమయ్యాడు.
'విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది'
కొమురం భీము నవల 'దండకారణ్య పర్స్పెక్టివ్'లో వచ్చింది. జగిత్యాల జైత్రయాత్రకి కొనసాగింపుగా వచ్చింది. ఇంద్రవెల్లి సంఘటన లేకపోతే, కొమురం భీము నవల లేదు. ఈ నవల రాసి సాహు, రాజయ్యలు కొమురం భీము పోరాటానికి, ఇంద్రవెల్లి పోరాటానికి ఒక గత వర్తమనాల చారిత్రక వారధిని నిర్మించే కృషి చేశారు. అందుకే ఈ నవల వర్తమానంతో జరుపుతున్న సంభాషణ.
- వరవరరావు
