కొక్కోకుడు వెయ్యేళ్ళ క్రితం వాడు. గొప్ప సంస్కృత పండితుడు. తృతీయ పురుషార్ధమైన 'కామం' గురించి పూర్వశాస్త్రకర్తలు చెప్పిన దానిని శ్రద్ధగా అధ్యయనం చేసిన మహాపండితుడు కొక్కోకుడు. సృష్టి, స్థితి కారకమైన 'కామం' గృహస్థ ధర్మాలలో కెల్లా మిన్న అని భావించాడు కొక్కోకుడు. సాంఫిుక స్థితిగతులు చూసి తల్లిడిల్లాడు కొక్కోకుడు. శరీర పోషణకు ఆహారం ఎంత అవసరమో, కామమూ అంతేనని లోకానికి చాటాలనుకున్నాడు కొక్కోకుడు.
ప్రజలలో కామజ్ఞానం కలిగించాల్సిన అవసరాన్ని గుర్తించాడు కొక్కోకుడు. అప్పటికే సంస్కృతంలో కామశాస్త్ర గ్రంథాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా రేవణారాధ్యుడు 'స్మరతత్త్వ ప్రకాశిక' పేరుతో ఓ గ్రంథం రాశాడు. వేద వేదాంగాలలో నిక్షిప్తమైన 'కామ' భావనకు ఉదాహరణలను ఉటంకిస్తూ ఈ గ్రంథాన్ని ప్రజల కందించాడు రేవణారాధ్యుడు.
కొక్కోక మహాకవి కూడ సంస్కృత భాషలో అప్పటికి ప్రకటితమైన కామ శాస్త్రాలన్నింటినీ కూలంకషంగా చదివాడు. వాటి సారాన్ని రంగరిస్తూ, తన మేధకు పదును పెడుతూ 'రతిరహస్యమ్' పేరుతో మహాగ్రంథం రచించాడు.
సంస్కృత భాషలో విరచితమైన కొక్కోకుని 'రతిరహస్యం' గ్రంథానువాదం తెలుగులో జరగాల్సిన అవసరాన్ని 'ఎర్రయ' గుర్తించాడు. తేటతెలుగులో కొక్కోక గ్రంథాన్ని అందించిన మహానుభావుడు 'ఎర్రయ'.
క్రీ.శ. 1200 ప్రాంతంలో కొక్కోకుని 'రతి రహస్యమ్' సంస్కృత గ్రంథాన్ని ఎర్రయ తెనిగించాడు. కొక్కోకుని మీద గౌరవభావంతో దీనికి రతి రహస్యం బదులు 'కొక్కోకం' అని నామకరణం చేశాడు. తెలుగులోని కామశాస్త్ర గ్రంధాలలో సాటిలేని మేటిదిగా కొక్కోకమనే కోక కళాశాస్త్రం విరాజిల్లింది. ఇది ఎర్రయ చేతులమీదుగా బంగారానికి తావి అబ్బినట్టు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది.
కొక్కోకుని 'రతిరహస్యమ్' సమగ్రమెనౖ కామశాస్త్రం. ఇది మొత్తం మూడు ఆశ్వాసాల గ్రంథం. పదిహేను పరిచ్ఛేదాలుగా విభజితమయింది. కొక్కోకంలో కామకళకు సంబంధించిన సమస్త సమాచారమూ నిక్షిప్తమై వుంది. పూలలోని తీయని మకరందాన్ని తుమ్మెద గ్రహించినట్లుగా మనం కూడ 'కొక్కోకం'లోని విషయ పరిజ్ఞానాన్ని మన దైనందిన జీవితానికి అన్వయించుకోవాలి. సారం గ్రహించాలి. జీవితాన్ని సుఖసంపన్నం చేసుకోవాలి. సక్రమమైన, సమృద్ధమైన కామమే జీవితానికి సార్ధకతను చేకూరుస్తుంది.
I am unable have preview download. Can it be made avialable.
can it be retreived.
I didn't find the contents page and links in the ebook. It would have been good to have contents. Recommend this book to everyone who is going to be married and/or recently married. Very very useful book.
Where this book KOKKOKAM Is available for purchasing.