-
-
ఖూనీ
khooni
Author: Tripuraneni Ramaswamy
Publisher: Tripura Prachuranalu
Pages: 46Language: Telugu
కవిరాజుకు నూటపాతికేళ్లు నిండాయి. ఆయన రచనలకు నూరేళ్లు వస్తున్నాయి. కొన్ని చదువుదామన్నా దొరకటం లేదు - దొరికినవి అర్థంకావటంలేదు అని భావించే వాళ్లు ఎదురవుతున్నారు. అటువంటి వారికోసమే యిటువంటి రచన.
అప్పట్లో రాజ్యాధికారం పురోహితవర్గం చెప్పుచేతల్లో వుంటే యిప్పట్లో ‘‘కోటరీ’’ల కనుసన్నల్లో వుంటుంది. అటువంటి కుతంత్రాలను కొందరు రాజులు గ్రహించి వాటిని వ్యతిరేకించిన సందర్భాలు అరుదు. కోటరీల కుతంత్రాలకు ఎదురు నిలువలేని ప్రజా ప్రభుత్వాలను మనం కళ్లప్పగించి చూస్తూనేవున్నాం. అటువంటి కుటిలయత్నాల్ని భగ్నం చేయవలసిన అవసరాన్ని కవిరాజు త్రిపురనేని ఆనాడే గ్రహించిన తీరును వెల్లడించేందుకే యీ ప్రయత్నం.
కాలగమనంలో భాష పటుత్వం రచనల్లో సన్నగిల్ల సాగింది. అయితే దానిని భావం పూరించేందుకు పూనుకుంది. భాషను కొంచెం మార్చినా, భావవిప్లవ ప్రదాత కవిరాజు త్రిపురనేని రామస్వామిగారి భావాలను యథాతథంగా యిందులో ప్రతిబింబించే ప్రయత్నం జరిగింది. ఈ మధ్య రామస్వామిగారు నాస్తికుడు కాదనేవరకు తీగపాకం లాగుతున్నారు కొందరు. ఈ నాటకం కొంతమేరకు అటువంటివారికి కనువిప్పుకాగలదు.
రామస్వామిగారు తమ పేరు చివరన వున్న ‘‘చౌదరి’’ అనే పదాన్ని తొలిసారిగా తొలిగించుకుంది ఈ రచన సందర్భంగానే అనేది అందరికీ గుర్తు చేయాలనుకున్నాం. నాటక రచనను పద్యాలు లేకుండా తీర్చిదిద్దిందీ యిందులోనే. ఇన్ని విషయాలు కలగలిసి యీ పుస్తకాన్ని యీ రూపంలో విూ ముందుండేట్లు చేశాయి.
ఈ నాటకాన్ని మన మాటల్లోకి రూపాంతరం చేసిన కవిరాజు సాహిత్యాభిమాని శ్రీ రావెల సాంబశివరావుకు వారికి సహకరించిన గుంటూరులోని కవిరాజు త్రిపురనేని రామస్వామి సాహితీ సమితి సభ్యులకు కృతజ్ఞతలు.
- ప్రచురణకర్తలు
