-
-
కథావార్షిక 2012
kathaa vaarshika 2012
Author: Katha Varshika
Publisher: Madhuranthakam Rajaram Sahithya Samstha
Pages: 135Language: Telugu
గత సంవత్సరం వచ్చిన తెలుగు కథల్ని (ముప్పయ్యో, నలభైయ్యో ఎంపిక చేసిన మంచి కథలు) చదువుతున్నప్పుడు; విభిన్నమైన కథా స్వరాలు, మృదువైన, మార్మికమైన (ప్రతీకాత్మక), నిర్వచనానికి లొంగని కంఠస్వరాలు; ఒక్కొక్క రచయిత కథలను తడిమి చూస్తే వాళ్ళ కథా స్వరాల వెనక ఒక సమూహ గానం (సామాజికమైన) అంతర్గతంగా దాగివున్నదేమో అనిపిస్తుంది. అవి, తన సామాజిక అస్థిత్వాల (వర్ణ, కుల, మత, ప్రాంతీయ) నుంచో, లేదా తన వైయుక్తికమైన అస్థిత్వం (పోగొట్టుకోడవటం, మెలాంకోలి, నార్సిజం నుంచో) ఎగసిన స్వర సంపుటిలా అనిపిస్తుంది. ఈ కథల్లో, కొత్త చూపు, ధ్వని, రిథం ఉన్నాయి.
* * *
ఈ సంపుటిలోని కథలు:
1. దేవుణ్ణి అటకాయించిన మనిషి : - మెహర్
2. ఒక దళారి పరాభవం: - జి. ఉమామహేశ్వర్
3. గోమెజ్ ఎప్పుడొస్తాడో: - వేలూరి వెంకటేశ్వరరావు
4. కాళాపు: - మన్నం సింధుమాధురి
5. కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్ళు: - విమల
6. వాంగ్మూలం: - స్వాతికుమారి
7. కాకికి కడవెడు: - స. వెం. రమేశ్
8. కథలు లేని కాలం: - ఓల్గా
9. దావత్: - మహమ్మద్ ఖదీర్‌బాబు
